వాట్ ఎన్ ఐడియా : నీరు లేకుండా స్నానం

  • Published By: madhu ,Published On : April 25, 2019 / 01:46 AM IST
వాట్ ఎన్ ఐడియా : నీరు లేకుండా స్నానం

నీరు లేకుండా ఏ పనిచేయలేం..అలాంటిది స్నానమా ? అని నోరెళ్లబెడుతున్నారా ?  నీటి అవసరమే లేకుండా స్నానం పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ‘నీటి అవసరం లేని స్నానం, షాంపూ’లు అందుబాటులోకి వచ్చాయి. అవును..నిజం..ఓ కంపెనీ దీనికి సంబంధించిన ఉత్పత్తులను రెడీ చేసింది. త్వరలోనే నీరు అవసరం లేని టూత్ పేస్టు కూడా రాబోతుందంట. మురికి, చెమట, దుర్గంధం లాంటి వాటిని స్నానంకంటే మెరుగ్గా శుభ్రం చేస్తుందంట. దీనికి సంబంధించిన వివరాలను ‘క్లెన్ స్టా వ్యవస్థాపకుడు, సీఈఓ పునీత్ గుప్తా వెల్లడించారు. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. 

ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను ‘క్లెన్ స్టా’ తయారు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తులను రిలీజ్ చేసింది. నీటి అవసరం లేని స్నానం, షాంపూలకు రెండు రాష్ట్రాల నుండి గిరాకీ అధికంగా ఉందని పునీత్ గుప్తా వెల్లడించారు. అందువల్లే ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. జుట్టు, శరీరంపై స్ప్రే చేసుకుని..రుద్ది టవల్‌తో తుడుచుకుంటే సరిపోతుందన్నారు. సైనికులు, ఆస్పత్రుల్లో చేరిన వారు ఎక్కువగా ఈ ఉత్పత్తులను వాడుతున్నారని ఆయన తెలిపారు.

100 మిల్లీమీటర్లు ఉండే దీనితో 7 నుండి 8 సార్లు స్నానం చేసేందుకు వీలవుతుందన్నారు. వీటి ధర రూ. 549, రూ. 499 ఉందన్నారు. భారతదేశంతో పాటు బ్రిటన్, కువైట్, సౌదీ అరేబియా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. తాగడానికే నీరు లేక అవస్థలు పడుతున్న ప్రాంతాల్లో స్నానానికి ఇబ్బందులు తప్పవు. మరి ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి పరిష్కారంగా తమ ఉత్పత్తి నిలుస్తుందంటున్నాడు పునీత్‌. ఆన్ లైన్‌లోనూ తమ ఉత్పత్తులు లభిస్తున్నాయన్నారు. త్వరలోనే నీటి అవసరం లేని టూత్ పేస్టు, దోమలు కుట్టకుండా నిరోధించే బాడీ బాత్ విడుదల చేస్తామన్నారు.