Tata Semiconductors: టాటా స‌న్స్‌ సంచలన నిర్ణయం.. సెమీ కండ‌క్టర్ల త‌యారీ రంగంలోకి!

టాటా స‌న్స్‌ గ్రూప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సెమీ కండ‌క్టర్ల త‌యారీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లుగా సమాచారం.

Tata Semiconductors: టాటా స‌న్స్‌ సంచలన నిర్ణయం.. సెమీ కండ‌క్టర్ల త‌యారీ రంగంలోకి!

Tata Sons

Tata Semiconductors: టాటా స‌న్స్‌ గ్రూప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సెమీ కండ‌క్టర్ల త‌యారీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లుగా సమాచారం. టెక్నాల‌జీ రంగానికి ఎంతో కీల‌క‌మైన సెమీ కండ‌క్టర్ల త‌యారీ రంగంలోకి అడుగు పెట్టనున్నట్లు సంకేతాలిచ్చారు టాటా స‌న్స్ చైర్మన్ చంద్రశేఖ‌ర‌న్‌. ఐఎంసీ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ వార్షిక స‌మావేశంలో ఈ విషయాన్ని చెప్పారు.

సెమీ కండ‌క్టర్ల త‌యారీ ప‌రిశ్రమ నెల‌కొల్పడానికి భారీ మొత్తంలో పెట్టుబ‌డులు అవ‌స‌రం. ల‌క్ష కోట్ల డాల‌ర్ల విలువైన మార్కెట్‌లో ప‌ట్టు సాధించే దిశ‌గా టాటా స‌న్స్ అడుగు ముందుకేసింది. అయితే, సెమీ కండ‌క్టర్ల రంగంలోకి ఎలా ఎంట‌ర‌వుతార‌న్న వివ‌రాల‌ను మాత్రం చంద్రశేఖ‌ర‌న్ వెల్లడించ‌లేదు. స్మార్ట్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, కార్లు ఇలా ప్రతిదీ సెమీకండక్టర్లతోనే లింక్ పెట్టుకున్నాయి.

అయితే కరోనాతో త‌లెత్తిన సంక్షోభం కారణంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, లాప్‌ట్యాప్ కంప్యూట‌ర్లకు డిమాండ్ పెరిగింది. ప‌ర్సన‌ల్ మొబిలిటీకి ప్రియారిటీ.. క్రిప్టో క‌రెన్సీల త‌యారీ.. అన్నింటికి మించి డ్రాగ‌న్‌పైనే ఆధార‌ప‌డ‌టం లాంటి అంశాలు ప్రస్తుతం టెక్నాల‌జీ రంగానికి కీల‌క‌మైన సెమీ కండ‌క్టర్ల కొర‌తను తెచ్చిపెట్టింది. ఇలాంటి సమయంలో టాటా సన్స్‌ గ్రూప్‌ సెమీకండక్టర్ల తయారీకి రెడీ అయింది.

అంతకుముందే 5జీ ఎక్విప్‌మెంట్ త‌యారీ రంగంలోకి ప్ర‌వేశించ‌నున్న‌ట్లు టాటా స‌న్స్ ప్ర‌క‌టించింది. దీంతోపాటు ప‌లుర‌కాల సంస్థ‌ల టేకోవ‌ర్‌తో టాటా డిజిట‌ల్ బిజినెస్ బ‌లోపేతం చేసే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టింది టాటా సన్స్. క‌రోనాతో లాక్‌డౌన్‌ల వ‌ల్ల ఫ్యాక్ట‌రీల మూసివేతతో సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌త‌ వచ్చింది.

టెక్నాల‌జీతో స‌హా అన్నీ రంగాల ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మైన విడి భాగాల కోసం ప్ర‌పంచ దేశాల‌న్నీ చైనాపైనే ఆధార‌పడగా చైనాకు ప్ర‌పంచ దేశాల‌కు మధ్య ఏర్పడ్డ గ్యాప్ కారణంగా ఆ దేశంతో లావాదేవీలు ఇబ్బందేనని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టాటా సన్స్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.