Tata Group : టాటా నియు యాప్… అన్నీ ఇక్కడి నుంచే, పూర్తి వివరాలు

ఈ యాప్ ద్వారా షాపింగ్ చేస్తే ప్రత్యేకమైన రివార్డులు కూడా వస్తాయి. యూపీఐ (UPI) పేమెంట్స్ సర్వీస్ టాటా పే ను కూడా అందుబాటులోకి తెచ్చారు. టాటా న్యూ యాప్ ను...

Tata Group : టాటా నియు యాప్… అన్నీ ఇక్కడి నుంచే, పూర్తి వివరాలు

Tata

Tata Group Launches New Super App : భారత దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ (Tata Group) సూపర్ యాప్ రెడీ అయిపోయింది. ఏప్రిల్ 07వ తేదీ నుంచే అందరికీ అందుబాటులోకి తెచ్చారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ టాటా నియుకు స్వాగతం అని చెబుతూ.. అధికారికంగా ప్రారంభించారు. ఈ రోజు నియు డే అని చంద్రశేఖరన్ మెసేజ్ చేశారు. ఈ యాప్ తో భారతీయుల జీవనం హాయిగా సాగిపోయేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. టాటా సర్వీసులు, యాప్స్ అన్నీ ఒకే ప్లాట్ ఫామ్ లో ఉండేలా ఈ యాప్ ను రూపొందించారు. నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్, హోటల్ బుకింగ్స్, ఫార్మసి ప్రొడక్ట్ లను ఆర్డర్ చేయడం, టాటా గ్రూప్ బిజినెస్ లు ఈ యాప్ లో ఉన్నాయి.

Read More : Ola S1 : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో లోపం.. అదే ఆటో రివర్స్ మోడ్‌లో వెళ్తోంది.. భయంతో అమ్మేశాడు..!

ఈ యాప్ ద్వారా షాపింగ్ చేస్తే ప్రత్యేకమైన రివార్డులు కూడా వస్తాయి. యూపీఐ (UPI) పేమెంట్స్ సర్వీస్ టాటా పే ను కూడా అందుబాటులోకి తెచ్చారు. టాటా న్యూ యాప్ ను ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఓఎస్ యూజర్లు యాపిల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే అమెజాన్, ప్లిప్ కార్ట్, రిలయెన్స్ జియో మార్ట్, పేటీఎంలున్న సంగతి తెలిసిందే. వీటికి గట్టిపోటీనిస్తుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Read More : Fuel Prices Today : బాదుడుకు బ్రేక్.. 3 రోజులుగా మారని పెట్రోల్, డీజల్ ధరలు

టాటా న్యూ యాప్ లో ఉన్న సర్వీసులు
ఆన్ లైన్ లో నిత్యావసరాలు ఆర్డర్ చేసేందుకు బిగ్ బాస్కెట్, ఆన్ లైన్ ఫార్మసి. ఈ కామర్స్ ప్లాట్ పామ్, ఇండియో హోటల్స్ బుకింగ్స్, ఎలక్ట్రానిక్ రిటైల్ ప్లాట్ ఫామ్ తదితర సర్వీసులున్నాయి. ఆఫ్ లైన్ల గురించి సమాచారం కూడా ఇందులో ఉంటుంది. క్రొమా, ఎయిర్ ఏషియా, తాజ్ హోటల్స్, బిగ్ బాస్కెట్, ఐహెచ్ సీఎల్, క్యూ మిన్, వెస్ట్ సైడ్, స్టార్ బక్స్, టాటా 1ఎంజీ సేవలను అందుబాటులోకి వచ్చాయి.