Tata Motors: కొత్త కార్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే, 300 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.. ధర తక్కువే!

దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ 2025 నాటికి భారత మార్కెట్లో 10 కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. సంస్థ ప్రస్తుతం టైగోర్ మరియు నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను విక్రయిస్తోంది.

Tata Motors: కొత్త కార్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే, 300 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.. ధర తక్కువే!

Tata Motors

Tata Motors: దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ 2025 నాటికి భారత మార్కెట్లో 10 కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. సంస్థ ప్రస్తుతం టైగోర్ మరియు నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను విక్రయిస్తోంది. తన మార్కెట్ స్థితిని మరింత మెరుగుపరచడానికి, టాటా మోటార్స్ ఇప్పుడు రాబోయే సంవత్సరంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయ్యాలని యోచిస్తోంది. పెట్రోల్ ధరలు బాగా పెరిగిపోతున్న సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూసే అవకాశం ఉండడంతో వీటిని వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకుని రావాలని భావిస్తోంది కంపెనీ.

టాటా ఆల్ట్రోజ్ మరియు కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ మినీ ఎస్‌యూవీని కంపెనీ విడుదల చసేందుకు ప్లాన్ చేస్తుంది. ఆల్ట్రోజ్ EV వచ్చే ఏడాది ప్రారంభంలో రానుండగా.., HBX- ఆధారిత EV-2022 రెండవ భాగంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. రెండు మోడళ్ల ధర రూ.10 లక్షల లోపే ఉంటుందని అంచనా వేస్తున్నాయి మార్కెట్ వర్గాలు.

టాటా ఆల్ట్రోజ్ EV(Tata Altroz EV): ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కేటగిరీలో రాబోతున్న ఈ కారు 2019లో స్విట్జర్లాండ్‌లో జెనీవా మోటార్ షోలో ఫస్ట్ టైమ్ ప్రదర్శించింది కంపెనీ. ఈ కారును వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయవచ్చు. టాటా ఆల్ట్రోజ్ EV డిజైన్ సాధారణ ఆల్ట్రోజ్‌తో సమానంగా ఉంటుంది. బంపర్ మాత్రం మారవచ్చు. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను ఆల్ట్రాజ్ EVలో చూడవచ్చు, ఇది Nexon EVలో ఇవ్వబడింది. నెక్సాన్ EV శాశ్వత మాగ్నెట్ ఎసి మోటారుతో IP67 రేటింగ్ సర్టిఫికేట్ 30.2kWh బ్యాటరీ ప్యాక్‌ను ప్యాక్ చేస్తుంది.

ఆల్ట్రోజ్ EVని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కి.మీ నుంచి 300 కి.మీ మధ్య నడుస్తుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 80శాతం వరకు ఛార్జ్ చేయడానికి బ్యాటరీకి గంట టైమ్ పడుతుంది. సాధారణ పవర్ సాకెట్‌‌తో ఛార్జ్ చేయడానికి 8 గంటలు పడుతుంది. ఛార్జింగ్ చరిత్ర, ప్రస్తుత బ్యాటరీ ఛార్జ్ కండిషన్, రిమోట్ పర్యవేక్షణ, పరిధి, సమీప ఛార్జింగ్ స్టేషన్ మొదలైన 35 కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్లను అందించే ZConnect యాప్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉంది. దీని ధర రూ. 9లక్షల వరకు ఉండవచ్చు.

Tata Altroz Ev

Tata Altroz Ev

టాటా హెచ్‌బిఎక్స్ EV(TATA HBX EV): భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా SUV వెహికల్స్‌ను వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కెటగిరీలో SUVలు అనేవి తక్కువే. టాటామోటర్స్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హెచ్‌బిఎక్స్ పేరుతో వచ్చే ఏడాది ఓ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు ధర రూ.6లక్షల నుంచి 9లక్షల మధ్య ధరల్లో విడుదల చేస్తారని టాక్. ఈ కారు నెక్సాన్‌ను పోలి ఉంటుందని టాక్ కూడా వినిపిస్తోంది.

ప్రస్తుతం దేశంలో ఎస్‌యూవీ మోడళ్లలో హ్యూండయ్ క్రెటా, కియా సెల్టోస్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్‌లు ఉన్నాయి. మారుతీ సుజుకీ కూడా ఇగ్నిస్, అర్బన్ ఎస్‌యూవీలను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది. టాటా కూడా ఈ విభాగంలో కొత్త కార్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. టాటా, హ్యూండయ్ త్వరలో రెండు కొత్త ఎస్‌యూవీలను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. ఇప్పటికే టాటా కంపెనీ, ఆటో ఎక్స్‌పో-2020లో హెచ్‌బిఎక్స్‌ను ఆవిష్కరించింది. టాటా హెచ్‌బిఎక్స్ అనేది కేవలం ఒక కాన్సెప్ట్ పేరు మాత్రమేనని, లాంచ్ చేయనున్న కారుకు టాటా హార్న్‌బిల్‌ అనే పేరు పెట్టవచ్చు అని సమాచారం.

Tata Hbx

Tata Hbx