Tata Motors & ICICI: ఐసిఐసిఐ బ్యాంక్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్యం

ఈవీ డీలర్ ఫైనాన్సింగ్ పరిష్కారాన్ని అందించడానికి ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీని కింద, టాటా మోటార్స్ అధీకృత ప్రయాణీకుల ఈవీ డీలర్‌లకు ఐసీఐసీ బ్యాంక్ ఇన్వెంటరీ నిధులను అందిస్తుంది. ఈ ఇన్వెంటరీ ఫండింగ్ డీజిల్, పెట్రోల్ మోడళ్ల కోసం డీలర్‌లకు బ్యాంక్ అందించే నిధులకు అదనంగా ఉంటుంది

Tata Motors & ICICI: ఐసిఐసిఐ బ్యాంక్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్యం

Tata Motors Partnership with ICICI Bank

Tata Motors & ICICI: ముంబై, 24 జనవరి, 2022: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఎలక్ట్రిక్ వెహికిల్-ఈవీ) స్వీకరణను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా భారతదేశపు ప్రముఖ ఆటోమోటివ్ తయారీదారు టాటా మోటార్స్, తన అధీకృత ప్రయాణీకుల ఈవీ డీలర్‌లకు ఈవీ డీలర్ ఫైనాన్సింగ్ పరిష్కారాన్ని అందించడానికి ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీని కింద, టాటా మోటార్స్ అధీకృత ప్రయాణీకుల ఈవీ డీలర్‌లకు ఐసీఐసీ బ్యాంక్ ఇన్వెంటరీ నిధులను అందిస్తుంది. ఈ ఇన్వెంటరీ ఫండింగ్ డీజిల్, పెట్రోల్ మోడళ్ల కోసం డీలర్‌లకు బ్యాంక్ అందించే నిధులకు అదనంగా ఉంటుంది. ఈ సదుపాయం కింద ఈవీ డీలర్లు సౌకర్యవంతమైన రీపేమెంట్ కాలపరిమితిని పొందవచ్చని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

OnePlus 11 Price Leak : అత్యంత చౌకైన ధరకే వన్‌ప్లస్ 11 ఫోన్ వచ్చేస్తోంది.. iQOO 11 కన్నా చీపెస్ట్ 5G ఫోన్ ఇదే..? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఈ భాగస్వామ్యానికి సంబంధించిన ఎంఓయూపై శైలేష్ చంద్ర (టాటా మోటర్స్), రాకేష్ ఝా(ఐసీఐసీఐ) సంతకం చేశారు. ఈ భాగస్వామ్యం గురించి శైలేష్ చంద్ర స్పందిస్తూ “దేశంలో ఈవీలకు మార్గదర్శకంగా ఉంటూ, వాటిని విజయవంతం చేయడానికి మేము బాధ్యత వహిస్తాము. పూర్తి విద్యుదీకరణను సాధించడం, గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడం కోసం మా లక్ష్యంలో, ప్రత్యేకమైన ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్‌తో మా అధీకృత ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్ భాగస్వాములకు సహాయం చేయడానికి ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉంది. మా డీలర్ నెట్‌వర్క్ మా ప్రధాన సహకార పిల్లర్లలో ఒక భాగం. వారి నిరంతర ప్రయత్నం ద్వారా మేము భారతదేశంలో విద్యుదీకరణ ప్రక్రియను విస్తృతం చేస్తాం’’ అని అన్నారు.

Samsung Galaxy S23 Ultra : ఫిబ్రవరి 1న శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే Ultra మోడల్ ధర లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఇక ఇదే విషయమై రాకేశ్ ఝా మాట్లాడుతూ “పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల కోసం పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌తో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈవీల లాంచ్ ఆటోమొబైల్ రంగంలో ముఖ్యమైన ఆవిష్కరణలలో ఒకటి. ఐసీఐసీ బ్యాంక్ వినూత్న సాంకేతిక కార్యక్రమాలకు ఎప్పటి నుంచో మద్దతు ఇస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీకి చెందిన అధీకృత డీలర్ల కోసం ఎలక్ట్రిక్ వెహికల్ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్‌ను అందించడానికి టాటా మోటార్స్‌తో భాగస్వామిగా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఇది సుస్థిర భవిష్యత్తు వైపు భారతదేశ ప్రయాణంలో మా నిరంతర భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది’’ అని అన్నారు.

Four Employees Suspend : ఏపీ వాణిజ్య పన్నుల విభాగంలో నలుగురు ఉద్యోగులు సస్పెండ్

టాటా మోటార్స్ దాని సంచలనాత్మక ప్రయత్నాలతో భారతీయ ఆటోమోటివ్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో 85.8% కమాండింగ్ మార్కెట్ వాటాతో ఇ-మొబిలిటీ వేవ్‌లో అగ్రగామిగా ఉంది. ఇప్పటి వరకు 57,000 పైగా ఎలక్ట్రిక్ వాహనాలను టాటా కంపెనీ ఉత్పత్తి చేసింది.