TCS Record: సాఫ్ట్‌వేర్ రంగంలో భారత్ సత్తా.. ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్‌లో టీసీఎస్!

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ప్రపంచంలోని సమాచార సాంకేతిక రంగానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్లలో రెండవ అత్యంత విలువైన బ్రాండ్‌గా అవతరించింది.

TCS Record: సాఫ్ట్‌వేర్ రంగంలో భారత్ సత్తా.. ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్‌లో టీసీఎస్!

Tcs

TCS Record: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ప్రపంచంలోని సమాచార సాంకేతిక రంగానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్లలో రెండవ అత్యంత విలువైన బ్రాండ్‌గా అవతరించింది.

బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 నివేదికలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐటీ సేవల్లో రెండవ అత్యంత విలువైన బ్రాండ్‌గా గుర్తింపు దక్కించుకుంది. మొదటి స్థానంలో యాక్సెంచర్ అత్యంత విలువైన ఐటీ సేవలు అందిస్తున్న బ్రాండ్‌గా ఉండగా.. మూడో స్థానంలో ఇన్ఫోసిస్ ఉంది.

అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ IBMని రెండో స్థానం నుంచి వెనక్కి నెట్టేసి ఈ స్థానానికి టీసీఎస్ చేరుకుంది.

టాప్ 25 లిస్ట్‌లో మరో నాలుగు భారతీయ కంపెనీలు..
‘బ్రాండ్ ఫైనాన్స్ ఐటి సర్వీసెస్ 25, 2022’ నివేదిక ప్రకారం, టీసీఎస్, ఇన్ఫోసిస్‌తో సహా టాప్ 25 కంపెనీల జాబితాలో మరో నాలుగు భారతీయ కంపెనీలు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ఏడవ స్థానంలో విప్రో, ఎనిమిదో స్థానంలో హెచ్‌సీఎల్‌, 15వ స్థానంలో టెక్ మహీంద్రా, LTI 22వ స్థానంలో ఉన్నాయి. ఈ ఆరు భారతీయ బ్రాండ్‌లు 2020-2022లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 ఐటీ సర్వీస్ బ్రాండ్‌ల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

Accenture.. వరల్డ్‌లో అత్యంత విలువైన IT బ్రాండ్:
యాక్సెంచర్ నివేదిక ప్రకారం.. 36.2 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన, బలమైన IT సేవల బ్రాండ్‌గా కొనసాగుతోంది.

నాల్గవ స్థానానికి IBM:
భారతీయ కంపెనీలు 2020-2022 మధ్య వేగవంతమైన వృద్ధిని సాధించాయని, IBM నాల్గవ స్థానానికి చేరుకోగా, TCS 12 శాతం వృద్ధితో 2020తో పోలిస్తే 24 శాతం వృద్ధితో రెండవ స్థానంలోకి వచ్చింది. TCS బ్రాండ్ విలువ మొత్తం 16.8 బిలియన్ డాలర్లు.

ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్‌గా ఇన్ఫోసిస్..
ఇన్ఫోసిస్ గత సంవత్సరంతో పోలిస్తే బ్రాండ్ విలువలో 52 శాతం.. 2020తో పోలిస్తే 80 శాతం పెరుగుదల కనిపిస్తోంది. 12.8 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న IT సర్వీస్ ప్రొవైడర్ బ్రాండ్‌గా ఇన్ఫోసిస్ అవతరించింది.

Delhi CM Kejriwal : ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ ఫోటోలు మాత్రమే ఉండాలని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ఆదేశం