Tech Tips : PDF ఫైల్ నుంచి పాస్‌వర్డ్‌ను తీసేయడం చాలా ఈజీ తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Tech Tips : ఆన్‌లైన్‌లో యూజర్ల ప్రైవసీ పరంగా అనేక సమస్యలు ఉన్నాయి. సాధారణంగా మనకు తెలియకుండానే పర్సనల్ డేటా లీక్ అవుతుంటుంది. సైబర్ నేరగాళ్లు యూజర్ల డేటాను హ్యాక్ చేసేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు.

Tech Tips : PDF ఫైల్ నుంచి పాస్‌వర్డ్‌ను తీసేయడం చాలా ఈజీ తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Tech Tips : ఆన్‌లైన్‌లో యూజర్ల ప్రైవసీ పరంగా అనేక సమస్యలు ఉన్నాయి. సాధారణంగా మనకు తెలియకుండానే పర్సనల్ డేటా లీక్ అవుతుంటుంది. సైబర్ నేరగాళ్లు యూజర్ల డేటాను హ్యాక్ చేసేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. అందులో ఎక్కువగా లింక్ క్లికింగ్ (Link Click), ఫిషింగ్ అని కూడా పిలుస్తారు. ఇలా పంపిన లింకుల్లో మాల్‌వేర్ వైరస్ ఉంటుంది.

పొరపాటున ఆయా లింకులను క్లిక్ చేస్తే అంతే సంగతులు.. మీ విలువైన డేటా సైబర్ నేరగాళ్ల చేతులకు చిక్కినట్టే. అందుకే యూజర్ల ప్రైవసీ ప్రొటెక్ట్ చేసేందుకు బ్యాంక్ వంటి ఇతర ఫైనాన్స్ సంస్థలు నెలవారీగా పంపే యూజర్ల స్టేట్ మెంట్లను PDF రూపంలో పంపిస్తుంటారు. ఈ ఫైల్స్ పాస్ వర్డ్ ప్రొటెక్ట్ (Password Protected) అయి ఉంటాయి. ఈ ఫైల్ ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా సంబంధిత పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Tech Tips _ How to remove password from a PDF file

Tech Tips _ How to remove password from a PDF file

ఇలాంటి PDF ఫైళ్లను యూజర్ ఈ-మెయిళ్లకు అటాచ్ చేసి పంపిస్తుంటారు. అయితే ఈ PDF ఫైళ్లను యాక్సస్ చేయాలంటే తప్పనిసరిగా Password ఎంటర్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ PDF ఫైళ్లకు సెక్యూరిటీ కోసం Lock వేస్తారు. ఇంతకీ ఇలాంటి మెయిళ్లలో పీడీఎఫ్ ఫైళ్లను ఓపెన్ చేయాలంటే ఆ పాస్ వర్డ ఎంటర్ చేయాల్సిందే. ఆ పాస్‌వర్డ్ ఏమని పెట్టారో తెలియకపోవచ్చు.

ఒకవేళ మెయిల్ పంపినవారిని సంప్రదించి పాస్ వర్డ్ తెలుసుకోవచ్చు. కానీ, కొన్నిసార్లు ఇలా పాస్‌వర్డ్ తెలుసుకోవడం సాధ్యపడదు. అలాంటి సమయంలో పాస్‌వర్డ్ Protected PDF పైళ్లలో సెట్ చేసిన PassWord ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. PDFల పాస్‌వర్డ్‌లను తీసివేయడం పెద్ద కష్టమేమీ కాదు.. PDFని అన్‌లాక్ చేయడానికి లేదా PDF ఫైల్ నుండి పాస్‌వర్డ్‌ను తీసివేయడానికి మీరు ఈ కిందివిధంగా ఫాలో అవ్వండి. అవేంటో ఓసారి చూద్దాం.

Adobe Acrobat ఉపయోగించి PDF పాస్‌వర్డ్‌ను ఎలా తొలగించాలో తెలుసా?

* మీ ల్యాప్‌టాప్ లేదా PCలో Adobe Acrobat లో PDFని ఓపెన్ చేయండి.

* Tools ఎంచుకోండి > Encrypt > Remove Securityపై క్లిక్ చేయండి.

మీ డాక్యుమెంట్‌లో ‘Document Open’ పాస్‌వర్డ్ ఉంటే.. దాన్ని డిలీట్ చేసేందుకు Okపై క్లిక్ చేయండి.

మీ డాక్యుమెంట్ యాక్సస్ చేసేందుకు పాస్‌వర్డ్‌ ఉంటే.. ఆ పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయండి. బాక్సులో సరైన పాస్‌వర్డ్‌ను టైప్ చేసి.. ఆపై OK క్లిక్ చేయండి.

మీరు ప్రస్తుత పాస్‌వర్డ్‌ను నమోదు చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ డాక్యుమెంట్ నుంచి పాస్‌వర్డ్‌ను తీసివేస్తుంది.

Android ఫోన్‌లో PDF పాస్‌వర్డ్‌ను ఎలా తొలగించాలంటే? :

built-in PDF viewer ఉపయోగించి మీ స్మార్ట్‌ఫోన్‌లో PDFని ఈజీగా ఓపెన్ చేయవచ్చు.

ఫైల్‌ను అన్‌లాక్ చేసేందుకు డాక్యుమెంట్ పాస్‌వర్డ్‌ (Document Password)ను నమోదు చేయండి.

Now Press Ctrl + P లేదా File > Print > Save as PDF ఆప్షన్ ఎంచుకోండి.

పాస్‌వర్డ్ లేకుండా కొత్త లొకేషన్‌లో File Save అవుతుంది. ఆ ఫైల్‌ను Save చేసేందుకు లొకేషన్ ‘PDF Print’గా సెట్ చేయండి.

మీ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీతో ఫైల్‌ను Save చేయండి.

Tech Tips _ How to remove password from a PDF file

Tech Tips _ How to remove password from a PDF file

Google Chromeలో PDF పాస్‌వర్డ్‌ను ఎలా తొలగించాలంటే? :

మీ Google Chromeలో PDF ఫైల్‌ను ఓపెన్ చేయండి.
File ఓపెన్ చేయడానికి PDF పాస్‌వర్డ్‌ను Type చేయండి.
ఇప్పుడు Ctrl + Pపై నొక్కండి. లేదా File > Print > PDFగా Save చేయండి.
PDF ఫైల్‌ను కావలసిన లొకేషన్‌లో Save చేయండి. కొత్త ఫైల్‌కు పాస్‌వర్డ్ ఉండదని గమనించాలి.

పైన పేర్కొన్న ఏదైనా పద్ధతులను అనుసరించి PDF పాస్‌వర్డ్‌లను తొలగించవచ్చు. మీరు ముందుగా PDF డాక్యుమెంట్ పాస్‌కోడ్‌ (PassCode)ను తెలుసుకోవాలని గమనించాలి. ఈ పద్ధతుల ద్వారా మీరు కేవలం సెక్యూరిటీ PINను మాత్రమే తొలగించవచ్చు.

Note : లాక్ చేసిన PDF నుంచి పాస్‌వర్డ్‌లను తొలగించడానికి ఏదైనా థర్డ్ పార్టీ ఆన్‌లైన్ వెబ్‌సైట్ లేదా యాప్‌ని ఉపయోగించరాదు. ఎందుకంటే అది మీ డేటాను వారి డేటాబేస్‌లో సేవ్ చేయవచ్చు. మీ వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు తస్కరించే అవకాశం ఉంది.

Read Also : iPhone Inbuilt Scanner : మీ ఐఫోన్‌లో ఇన్‌బుల్ట్ స్కానర్ ఉందని తెలుసా? చేతిరాత నోట్స్‌ను డిజిటల్ టెక్ట్స్‌గా మార్చుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్!