బ్రాండ్ అంటే ఇదే : హైదరాబాద్ ఐటీ ఎగుమతులు లక్ష కోట్లు

ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. దేశంలో సగటున ఐటీ ఎగుమతుల్లో వృద్ధి సాధిస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ మార్గదర్శిగా నిలిచింది.

  • Published By: sreehari ,Published On : April 29, 2019 / 07:43 AM IST
బ్రాండ్ అంటే ఇదే : హైదరాబాద్ ఐటీ ఎగుమతులు లక్ష కోట్లు

ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. దేశంలో సగటున ఐటీ ఎగుమతుల్లో వృద్ధి సాధిస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ మార్గదర్శిగా నిలిచింది.

ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. దేశంలో సగటున ఐటీ ఎగుమతుల్లో వృద్ధి సాధిస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ మార్గదర్శిగా నిలిచింది. ఐటీ ఎగుమతుల్లో గత ఏడాది ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా వృద్థి సాధించింది. ఐటీ శాఖ వార్షిక అభివృద్ధి నివేదిక (2018-19) ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. దాదాపు రూ.1లక్ష 09వేల 219 కోట్లు వృద్థి సాధించింది. 
Also Read : అదృష్టం వెన్నంటే ఉంటే : రెండు బాంబు దాడుల నుంచి బతికి బయటపడ్డాడు

2017-18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ. 93వేల 442 కోట్లు వృద్ధి సాధించింది. ఏడాదిలో ఐటీ ఎగుమతులు 17శాతంగా పెరిగింది. అంతేకాదు.. ఐటీ జాబ్స్ లో కూడా తెలంగాణ రికార్డు స్థాయిలో నిలిచింది. రాష్ట్రంలో 2018-19 సమయంలో 5లక్షల 43వేల 033 ఉద్యోగాలు పెరిగాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం సమయంలో 4లక్షల 75వేల 308 ఉద్యోగాల నుంచి 2018-19 సంవత్సరానికి 5లక్షల 43వేలకు పైగా ఉద్యోగాలు సృష్టించి రికార్డు సాధించింది.

అంటే ఐటీ ఉద్యోగాల వృద్ధి శాతం 14.2 శాతంగా నమోదు అయింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ఎక్స్ ఫోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ESC) అంచనా ప్రకారం.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 10శాతం మేర వృద్ధి సాధించినట్టు పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ఐటీ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. 2013-14 ఆర్థిక సంవత్సరం సమయంలో తెలంగాణ రాష్ట్రం సాధారణ ఐటీ ఎగుమతులు రూ.57వేల 258 కోట్లు మాత్రమే మొదలైనట్టు చెప్పారు.

అప్పట్లో.. ఐటీ ఎగుమతులను ఐదేళ్లలో రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగినట్టు తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో అనుకున్న లక్ష్యాన్ని చేరడంలో విజయం సాధించినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఐటీ వృద్థి సాధించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని, అదే ఉత్సాహంతో ఐటీ రంగంలో మరిన్ని అద్భుతాలు సాధించే దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తున్నట్టు రంజన్ తెలిపారు.
Also Read : గిఫ్ట్ విసిరికొట్టాడు : పక్కనే పెళ్లికూతురు.. PUBGతో పెళ్లికొడుకు ఫుల్ బిజీ