Minister Sitharaman on Economy: భారత్‌లో ద్రవ్యోల్బణం తక్కువగానే ఉంది: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

ప్రపంచంలోని పలు దేశాలతో పోల్చితే భారత్‌లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉందని కేంద్ర మంత్రి  నిర్మలా సీతారామన్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడుతూ...అమెరికా డాలర్ విలువ బలపడుతున్నప్పటికీ భారత రూపాయి స్థిరంగానే ఉంటోందని నిర్మలా సీతారామన్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. విదేశీ మారక నిల్వలూ బాగానే ఉన్నాయని అన్నారు.

Minister Sitharaman on Economy: భారత్‌లో ద్రవ్యోల్బణం తక్కువగానే ఉంది: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

Minister Sitharaman on Economy: ప్రపంచంలోని పలు దేశాలతో పోల్చితే భారత్‌లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉందని కేంద్ర మంత్రి  నిర్మలా సీతారామన్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడుతూ…అమెరికా డాలర్ విలువ బలపడుతున్నప్పటికీ భారత రూపాయి స్థిరంగానే ఉంటోందని నిర్మలా సీతారామన్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. విదేశీ మారక నిల్వలూ బాగానే ఉన్నాయని అన్నారు.

అంతేగాక, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం కొన్ని దేశాలపై విపరీతంగా పడిందని చెప్పారు. భారత్ పై కూడా ఆ ప్రభావం పడుతున్నప్పటికీ తాము సరైన సమయానికి తీసుకుంటున్న చర్యల కారణంగా ఉపశమనం లభిస్తోందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోల్చితే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో పోల్చి చూసుకోవాలని చెప్పారు. ద్రవ్య లోటు వంటి అన్ని అంశాలపై తాము దృష్టి పెడుతూనే ఉన్నాయని తెలిపారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అన్ని చర్యలూ తీసుకుంటోందని చెప్పారు.

దేశంలోని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలను వాడుకుని ఎన్డీఏ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందంటూ వస్తున్న విమర్శలపై నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రాథమిక ఆధారాలు లేనిదే ఈడీ దాడులు చేయదని అన్నారు. తనిఖీల్లో లభ్యమైన ఆధారాల్లో కొన్నింటిని మీడియాలోనూ చూపెడతారని చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం వంటివి వాటి గురించి వివరాలను చూస్తుంటామని తెలిపారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..