Flipkartలో రూ. 5999కే స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ఆఫర్లు!

  • Published By: vamsi ,Published On : October 12, 2020 / 05:10 PM IST
Flipkartలో రూ. 5999కే స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ఆఫర్లు!

Big Save on Bigger TV offer: ఈ సంవత్సరం మొత్తం మీ ఇంటికి అవసరమైన గృహోపకరణాలను కొనుగోలు చేసే ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉంటే.., ఇదే సరైన సమయంల వెంటనే త్వరపడండి. ఎందుకంటే Flipkartలో Big Billion Days sale వచ్చేసింది. ‘Big Save on Bigger TV offer’ కూడా మీ కోసం సిద్ధంగా ఉంది.

ఫ్లిప్‌కార్ట్ తన వార్షిక బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభిస్తోంది. మీ గృహోపకరణాలను అప్‌గ్రేడ్ చేయడానికి మంచి అవకాశం ఈ సమయం. ఈ సేల్ అక్టోబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య అందుబాటులోకి వచ్చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ఉన్నవాళ్లు అయితే అక్టోబర్ 15వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి ఈ సెల్‌లో పాల్గొనవచ్చు.



ఈ బిగ్ బిలియన్ డేస్‌లో యూరప్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్(urope’s leading consumer electronic brand) థామ్సన్ తక్కువ ధరలకే స్మార్టీవీలను అందిస్తోంది. అక్టోబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్‌లో జరగనున్న బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో ఈ బంపర్ ఆఫర్ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. ‘బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టీవీ ఆఫర్’ పేరుతో దీనిని తీసుకుని వచ్చింది. గత మూడేళ్లుగా భారత మార్కెట్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న థామ్సన్ ప్రస్తుతం ‘హర్ బాత్ బాది’ పేరిట మార్కెటింగ్ నిర్వహిస్తోంది. ఆర్9 సిరీస్ థామ్సన్ టీవీ డీల్స్ రూ .5999 నుండి ప్రారంభం అవుతాయి. ఆండ్రాయిడ్ థామ్సన్ స్మార్ట్ టీవీ ధర రూ.10999 నుండి ప్రారంభం అవుతుంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో, థామ్సన్ టివి గూగుల్ భాగస్వామ్యంతో భారతదేశంలో పూర్తిగా అభివృద్ధి చేసిన సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టివీని విడుదల చేసింది.



ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో టీవీ ఆఫర్‌లు:

R9 seriesలో వస్తున్న రెండు టీవీల్లో ఒకటి 24 HD Basic కాగా.. మరొకటి 32 HD Basic.. రెండు టీవీల ధరలు కూడా వరుసగా.. రూ. 5,999, రూ.8,499.

Path Series Thomson models:
32PATH0011 — Rs 10,999
32PATH0011BL — Rs 11,499
40PATH7777 –Rs 15,999
43PATH0009– Rs 18,999
43PATH4545 — Rs 22,499
50PATH1010 — Rs 24,499
55PATH5050 — Rs 28,999

OATHPRO Series Thomson TV modelsఫ
43 OATHPRO 2000 – 22,499 రూపాయలు
50 OATHPRO 1212 – 27,499 రూపాయలు
55 OATHPRO 0101 – 30,999 రూపాయలు
65 OATHPRO 2020 – 45,999 రూపాయలు
75 OATHPRO 2121 – 94,499 రూపాయలు

ఈ ఆఫర్లు అందుబాటులోకి రావడంతో రెండు లక్షల యూనిట్ల టీవీలు అమ్ముడు పోయే అవకాశం ఉందని, Super Plastronics Private Limited, (SPPL) and India Brand Licensee, Thomson TV సీఈఓ Avneet Singh Marwah చెప్పుకొచ్చారు.

బిగ్ బిలియన్ షాపింగ్ డేస్‌లో ఫ్లిప్‌కార్ట్ నోకియా స్మార్ట్ టీవీలపై కూడా ఆఫర్లు అందిస్తోంది. పండుగ సీజన్ సమీపిస్తుండటంతో నోకియా కొత్తగా ఆరు ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను తీసుకుని వచ్చింది. 32, 43, 50, 55 65 అంగుళాల స్మార్ట్ టీవీలను సరసమైన ధరలలో అమ్మాలని నిర్ణయించింది.



నోకియా స్మార్ట్ టీవీల ధరలు:
32 అంగుళాల టీవీ రూ .12,999
హెచ్‌డీ రెడీ 43 అంగుళాల టీవీ ధర రూ .22,999
ఫుల్ హెచ్‌డీ వేరియంట్ ధర రూ. 28,999
50 అంగుళాల టీవీ ధర రూ. 33,999
55 అంగుళాల ధర 39,999 రూపాయలు
65 అంగుళాల టీవీ ధర 59,999 రూపాయలు