చమురు ధరలు భగ్గు

  • Edited By: madhu , April 10, 2019 / 02:30 AM IST
చమురు ధరలు భగ్గు

చమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఇంధన ధరలు పైకి ఎగబాకుతున్నాయి. క్రూడాయిల్ ధర ఐదు నెలల గరిష్టస్థాయికి చేరుకుంది. లిబియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయని పెట్రోల్ బంకుల కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇరాన్, వెనిజులా దేశాలకు చెందిన చమురును కొనుగోలు చేయవద్దని అగ్రరాజ్యం అమెరికా ఆదేశాలు జారీ చేయడంతో ధరలపై ప్రభావం చూపించింది. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం బ్యారెల్ క్రూడాయిల్ ధర 71.34 డాలర్లకు చేరుకుంది. గతేడాది నవంబర్ తర్వాత ఇంధనానికి ఇదే గరిష్టస్థాయి ధర ఉంది. నవంబర్ 2018లో బ్యారెల్ ధర రూ. 64.77గా ఉన్నది. ఉత్పత్తిలో కోత విధించనున్నట్లు ఒపెక్ దేశాలు ప్రకటించాయి. ఒపెక్‌లో సభ్యత్వం కలిగిన లిబియా ప్రతి రోజు 10 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్‌ను సరఫరా చేస్తోంది. 

నగరం పెట్రోల్ ధర డీజిల్ ధర
హైదరాబాద్ రూ. 77.20 రూ. 71.83
న్యూఢిల్లీ రూ. 72.80 రూ. 66.11
ముంబై రూ. 78.37 రూ. 69.19
చెన్నై రూ. 75.56 రూ. 69.80
బెంగళూరు రూ. 75.17 రూ. 68.25
భువనేశ్వర్ రూ. 71.74 రూ. 70.84
ఛండీగడ్ రూ. 68.79 రూ. 62.93