మళ్లీ పెరుగుతున్నాయి : పెట్రోల్ లీటర్ రూ.76

  • Published By: madhu ,Published On : February 25, 2019 / 03:32 AM IST
మళ్లీ పెరుగుతున్నాయి : పెట్రోల్ లీటర్ రూ.76

మరలా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ధరలు తగ్గుతాయని అనుకున్న వాహనదారులకు నిరాశే మిగులుతోంది. గత కొన్ని రోజులుగా కొద్ది కొద్దిగా ధరలు పైకి ఎగబాకుతున్నాయి. చమురు ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే..అంతర్జాతీయంగా మడి చమురు ధరలు పెరగడంతోనే దేశీయంగా ధరలు అధికమౌతున్నాయని చమురు సంస్థలు పేర్కొంటున్నాయి. లీటర్ పెట్రోల్ రూ. 71 నుండి 76 ఉంటోంది. డీజిల్ ధర కూడా ఇంచుమించు అలాగే ఉంది. 

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 71.57 ఉంటే డీజిల్ ధర రూ. 66.80గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ. 77.20, డీజిల్ ధర రూ. 69.97గా ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ రూ. 75.95, డీజిల్ ధర రూ. 72.63 వద్ద కొనసాగుతోంది. 

నగరం పెట్రోల్ లీటర్ డీజిల్ లీటర్
ఢిల్లీ   రూ. 71.57 రూ. 66.80
ముంబై రూ. 77.20 రూ. 69.97
చెన్నై రూ. 74.32 రూ. 70.59
బెంగళూరు రూ. 73.95 రూ. 69.01
హైదరాబాద్ రూ. 75.95 రూ. 72.63