Twitter Blue: ఇండియాలో ట్విట్టర్ బ్లూ నెలకు రూ.9,400.. ఏప్రిల్ 1 నుంచి అమలు

వ్యక్తిగత అకౌంట్లతోపాటు, సంస్థలకు కూడా లెగసీ చెక్‌మార్క్స్‌ తొలగిస్తారు. ట్విట్టర్ బ్లూ కావాలనుకుంటే వెబ్ బ్రౌజర్ ద్వారా నెలకు 7 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే అమలవుతున్న లెగసీ వెరిఫైడ్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 1 నుంచి రద్దవుతుంది. చెక్ మార్క్ కావాలనుకుంటే ట్విట్టర్ బ్లూను సైన్ అప్ చేసుకోవాలి.

Twitter Blue: ఇండియాలో ట్విట్టర్ బ్లూ ధర నెలకు రూ.9,400గా ఉండనుంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ట్విట్టర్ బ్లూ ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ట్విట్టర్ బ్లూ వెరిఫికేషన్ ధర విదేశాల్లో నెలకు 7 డాలర్లుగా ఉండనుంది. అలాగే ఏప్రిల్ 1 నుంచి లెగసీ బ్లూ వెరిఫైడ్ చెక్‌మార్క్స్‌ను తొలగించబోతున్నట్లు ఎలన్ మస్క్ శుక్రవారం ప్రకటించాడు.

Manchu Vishnu Vs Manoj : అన్నదమ్ముల గొడవ పై స్పందించిన మోహన్ బాబు.. నాకేం తెలియదంటున్న మంచు లక్ష్మి!

వ్యక్తిగత అకౌంట్లతోపాటు, సంస్థలకు కూడా లెగసీ చెక్‌మార్క్స్‌ తొలగిస్తారు. ట్విట్టర్ బ్లూ కావాలనుకుంటే వెబ్ బ్రౌజర్ ద్వారా నెలకు 7 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే అమలవుతున్న లెగసీ వెరిఫైడ్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 1 నుంచి రద్దవుతుంది. చెక్ మార్క్ కావాలనుకుంటే ట్విట్టర్ బ్లూను సైన్ అప్ చేసుకోవాలి. బ్లూ చెక్ మార్క్ వల్ల యూజర్లకు అనేక ప్రయోజనాలుంటాయి. ట్వీట్లలో ప్రాధాన్యం, తక్కువ యాడ్స్, లాంగ్ ట్వీట్స్, బుక్ మార్క్ ఫోల్డర్స్, కస్టమ్ నావిగేషన్, ఎడిట్ ట్వీట్, అన్ డూ ట్వీట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం అమెరికాలో వ్యక్తిగత ట్విట్టర్ బ్లూ చెక్ మార్క్స్ వెబ్‌పై 8 డాలర్లు ఉంది. యాప్‌లో నెలకు 11 డాలర్లు ఉంది.

UK Teenage Love Story : అద్భుతమైన ‘ప్రేమ’కథ .. 19 ఏళ్లలో ప్రేమ, 79 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న ప్రేమికులు

గతంలో ఉచితంగా అందుబాటులో ఉన్న వెరిఫైడ్ చెక్‌మార్క్స్‌ను ఎలన్ మస్క్ తొలగించిన సంగతి తెలిసిందే. తర్వాత ప్రవేశపెట్టిన ట్విట్టర్ లెగసీ వెరిఫైడ్ ప్రోగ్రామ్‌లో అనేక అవకతవకలు జరిగాయి. పలు ఫేక్ అకౌంట్లు పుట్టుకొచ్చాయి. దీంతో ఈ కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు మస్క్ ప్రకటించారు.

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే 4,000 క్యారెక్టర్ల వరకు ఉండే లాంగ్ ట్వీట్లు చేయవచ్చు. ఇతరులతో పోలిస్తే 50 శాతం మాత్రమే యాడ్స్ ప్లే అవుతాయి. కంపెనీలు, బ్రాండ్ల అధికారిక ఖాతాలకు గోల్డ్ చెక్ మార్క్, ప్రభుత్వ ఖాతాలకు గ్రే కలర్ చెక్ మార్క్ ఉంటుంది. నెలకు 1,000 డాలర్లు చెల్లించాలని ట్విట్టర్ వ్యాపార సంస్థలను కోరింది. లేకుంటే గోల్డ్ బ్యాడ్జెస్ తొలగిస్తామని హామీ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు