Twitter Edit Feature : మీ ట్వీట్‌ను ఇకపై 5 సార్లు ఎడిట్ చేసుకోవచ్చు.. కానీ, ఆ టైంలోగా మాత్రమే.. తప్పక తెలుసుకోండి!

Twitter Edit Feature : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ (Twitter) కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇప్పటివరకూ ఇతర సోషల్ ఫ్లాట్‌ఫాంలో ఏదైనా పోస్టు పెడితే మళ్లీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ, ట్విట్టర్ మాత్రం అలాంటి ఎడిట్ ఆప్షన్ అందించలేదు.

Twitter Edit Feature : మీ ట్వీట్‌ను ఇకపై 5 సార్లు ఎడిట్ చేసుకోవచ్చు.. కానీ, ఆ టైంలోగా మాత్రమే.. తప్పక తెలుసుకోండి!

Twitter will let you edit your tweets, but there is a limit

Twitter Edit Feature : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ (Twitter) కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇప్పటివరకూ ఇతర సోషల్ ఫ్లాట్‌ఫాంలో ఏదైనా పోస్టు పెడితే మళ్లీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ, ట్విట్టర్ మాత్రం అలాంటి ఎడిట్ ఆప్షన్ అందించలేదు. ఎప్పటినుంచో ట్విట్టర్ యూజర్లు Tweet Edit Feature కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ట్విట్టర్ యూజర్ల డిమాండ్ మేరకు Tweet Edit Feature తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అతి త్వరలో ట్విట్టర్ ఎడిట్ ట్వీట్ ఫీచర్ రిలీజ్ చేయనుంది.

యూజర్లు త్వరలో తమ ట్వీట్లను ఎడిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కొత్త ఎడిట్ ఫీచర్ టెస్టింగ్ చేస్తున్నట్టు బ్లాగ్ పోస్ట్‌లో ధృవీకరించింది. ఈ ఫీచర్‌ను ఇప్పటికే కొద్ది మంది యూజర్లతో టెస్టింగ్ చేస్తోంది. త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకురానుందని మైక్రో బ్లాగింగ్ దిగ్గజం వెల్లడించింది. అయితే, ట్విట్టర్ Edit Feature అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ట్వీట్లను ఎడిట్ చేయడానికి త్వరలో యూజర్లను అనుమతిస్తామని, అయితే దానికి లిమిట్ ఉంటుందని ట్విట్టర్ వెల్లడించింది.

Twitter will let you edit your tweets, but there is a limit

Twitter will let you edit your tweets, but there is a limit

అన్నింటిలో మొదటిది.. యూజర్లు తమ ట్వీట్‌ను పోస్టు చేసిన తర్వాత మార్పులు చేయడానికి 30 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. అదనంగా, ప్లాట్‌ఫారమ్ ప్రతి ట్వీట్‌ను ఎడిట్ చేసేందుకు 5 అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ట్విట్టర్ నిర్దేశించిన టైంలోగా ట్వీట్ ఎడిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. మీరు మీ ట్వీట్‌ని ఎడిట్ చేశారో లేదో ఎవరైనా సులభంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే.. మీరు ఒకసారి ట్వీట్ పోస్టు చేసిన తర్వాత ఎడిట్ చేస్తే ఎవరికి తెలియదులే అనుకుంటే పొరపాటే. మీరు సవరించిన ప్రతి ట్వీట్లకు ఐకాన్, టైమ్‌స్టాంప్, లేబుల్‌ సహా కనిపిస్తాయని Twitter ధృవీకరించింది. అసలు ట్వీట్ ఎడిట్ చేశారనే విషయం ట్వీట్ చూసిన ఇతర యూజర్లకు స్పష్టంగా తెలుస్తుంది. ట్వీట్ కింద లేబుల్‌ను నొక్కడం ద్వారా ట్వీట్ ఎడిట్ హిస్టరీకి వెళ్లి ఎన్నిసార్లు మార్పులు చేశారో చెక్ చేయవచ్చు.

ఇందులో ట్వీట్ గత వెర్షన్‌లు ఉంటాయని అని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉండదు. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ (Twitter Blue Subscription) ఉన్నవారికి ఈ ఫీచర్ మొదట అందుబాటులోకి వస్తుందని ట్విట్టర్ ధృవీకరించింది. అయితే ప్రస్తుతానికి, నాన్-బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు కూడా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఎలాంటి నిర్ధారణ లేదు. ఇంతకీ ట్విట్టర్ యూజర్లు ఈ ఫీచర్‌ని ఎలా ఉపయోగిస్తున్నారు అనే దానిపై తెలుసుకోవచ్చు. ఎడిట్ బటన్ ఫీచర్‌ (Edit Button Feature)ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు ట్విట్టర్ తెలిపింది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎడిట్ ఫీచర్ పొందే అవకాశం ఉంది. కానీ, ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ భారత యూజర్లకు అందుబాటులో లేదు.

Twitter will let you edit your tweets, but there is a limit

Twitter will let you edit your tweets, but there is a limit

ఈ ఫీచర్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సహా ఎంపిక చేసిన దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్‌తో సహా ఇతర మార్కెట్లలో ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కచ్చితంగా తెలియదు. ఒకవేళ మీకు తెలియకుంటే.. Twitter Blue Subscription అనేది ప్రాథమికంగా పేమెంట్ మెంబర్‌షిప్ ఆధారంగా పనిచేస్తుంది. ట్విట్టర్‌లో ఫీచర్లతో ఈజీగా ఉండాలంటే ప్రీమియం ఫీచర్‌లకు ప్రత్యేక యాక్సెస్‌ ఉంటుంది. ప్రాథమికంగా టెలిగ్రామ్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా ట్విట్టర్ ఉంటుంది. కొన్ని నెలల క్రితమే మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ సబ్‌స్క్రిప్షన్-ఆధారిత సర్వీసును ప్రారంభించింది. ఇందులో పెద్ద ఫైల్‌లను అప్‌లోడ్ చేయడానికి సపోర్టు చేస్తుంది. అలాగే వేగవంతమైన డౌన్‌లోడ్‌లు, మరిన్నింటి వంటి కొన్ని ప్రీమియం ఫీచర్లను కూడా ట్విట్టర్ అందిస్తుంది.

Read Also : Apple IPhone 14 Series: భారత్‌లో ఐఫోన్ 14 సిరీస్ అందుబాటులోకి ఎప్పుడొస్తుంది? ధరలు ఎలా ఉన్నాయంటే?