రెండు చైనా కంపెనీలపై అమెరికా నిషేధం.. భారత్‌పై ప్రభావం ఉంటుందా?

  • Published By: sreehari ,Published On : July 1, 2020 / 08:09 PM IST
రెండు చైనా కంపెనీలపై అమెరికా నిషేధం.. భారత్‌పై ప్రభావం ఉంటుందా?

చైనాకు చెందిన 59 యాప్స్‌పై భారత్ నిషేధం విధించిన మరుసటి రోజే మరో రెండు చైనా కంపెనీలపై నిషేధించారు. భారత్ డిజిటల్ స్ట్రయిక్ ప్రకటించిన తర్వాత అమెరికా కూడా చైనాకు చెక్ పెట్టేసింది. డ్రాగన్ కంట్రీకి చెందిన huawei టెక్నాలజీస్, జెడ్‌టీఈ కార్పోరేషన్లను ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ (FCC) యూనివర్సల్ సర్వీస్ ఫండ్‌ నుంచి నిషేధించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు కంపెనీలకు చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ, చైనా మిలటరీ, ఇంటలిజెన్స్ విభాగాలతో సంబంధాలున్నాయనే సంబంధం ఉందని గుర్తించింది.

చైనా ఇంటలిజెన్స్ సర్వీసుల కోసం డ్రాగన్ చట్టాలకు లోబడి పనిచేస్తాయి. రెండు చైనా ఇంటెలిజెన్స్‌ విభాగానికి సహకరిస్తామని ఒప్పందాలు కుదుర్చుకున్నాయని FCC చైర్‌పర్సన్‌ అజిత్‌పాయ్ ‌తెలిపారు. ఈ రెండింటి యాప్ సర్వీసు కంపెనీలతో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఉందని అమెరికా అలర్ట్ ప్రకటించింది. వావే, జెడ్‌టీఈలను నిషేధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మిత్ర దేశమైన ఇండియాపై కూడా అమెరికా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది.

US says Huawei, ZTE are ‘national security threats’: How will this impact India?

సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో భారతదేశం 59 చైనీస్‌ యాప్‌ల నిషేధం విధించింది. అయితే ఇప్పడు ఈ రెండు కంపెనీలపై కూడా నిషేధం విధిస్తే భారత టెలికాం రంగంలో పెను మార్పులకు కారణమవుతుందని భావిస్తోంది. వావే ఎంతో కాలంగా దేశీయ టెలికాం కంపెనీలకు తక్కువ ధరకు డివైజ్ లను అందిస్తోంది. 5G స్పెక్ట్రమ్‌ను దేశంలో అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ కంపెనీలపై నిషేధం విధిస్తే ఇండియాపై భారం పెరిగే అవకాశం ఉంది. దేశంలో 4G సర్వీసులను ప్రారంభించినప్పుడు వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ వంటి సంస్థలకు చైనాకు చెందిన ఈ కంపెనీలే డివైజ్ లను అందించాయి.