లీటర్ పెట్రోల్ ఒక రూపాయి 45 పైసలు

లీటర్ పెట్రోల్ ఒక రూపాయి 45 పైసలు

Venezuela selss cheapest petrol Rs.1.45 paisa per litre : లీటర్ పెట్రోల్ రూపాయి 45 పైసలా? …….. అవునా ? ……….. అవును.. ఆశ్చర్యపోకండి…. అక్కడ లీటర్ పెట్రోల్ రూపాయి నలభై ఐదు పైసలు మాత్రమే. అది ఎక్కడంటారా వెనిజులాలో. మనదేశంలో దాదాపు రూ.100 కి చేరువలో ఉన్నాయి పెట్రోల్ డీజిల్ రేట్లు. రాజస్ధాన్, మధ్యప్రదేశ్ లలోని కొన్ని ప్రాంతాల్లో అయితే సెంచరీ దాటేశాయి కూడా.

గడిచిన 19 రోజుల్లో భారత్ లో 13 సార్లు పెట్రోల్ రేట్లు పెరిగాయంటే ధరలు ఏస్ధాయిలో మండుతున్నయో అర్ధం చేసుకోవచ్చు. దక్షిణ అమెరికా దేశాల్లో ఒకటైన వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర కేవలం ఒకరూపాయి 45 పైసలుగా ఉంది. అంటే 0.020 డాలర్లు ఉంది.

పెట్రోల్ అత్యంత చౌకగా విక్రయించే మొదటి పది దేశాల్లో ఐదు ఆసియాలో, నాలుగు ఆఫ్రికాలో, ఒకటి దక్షిణ అమెరికాలో ఉన్నాయి. మరోవైపు 2.40 డాలర్ల వద్ద హాంకాంగ్‌లో పెట్రోలు అత్యంత ఎక్కువ రేటు పలుకుతోంది. తరువాత స్థానాల్లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ , నెదర్లాండ్స్ ఉన్నాయి.

మన దేశంతో పోలిస్తే, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ , భూటాన్ దేశాల్లో పెట్రోల్ తక్కువ రేటుకే దొరుకుతోంది. ముఖ్యంగా భూటాన్‌లో పెట్రోలు ధర బాగా చౌక. భారత కరెన్సీ ప్రకారం వివిధ దేశాల్లో లీటర్ పెట్రోల్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పాకిస్తాన్‌లో రూ. 51.14

భూటాన్‌లో రూ.49.56

శ్రీలంకలో రూ .60.26.

బంగ్లాదేశ్‌లో రూ. 76.41

నేపాల్‌లో రూ.68.98

ఇరాన్ లో రూ.4.50 ఉండగా

అంగోలాలో రూ.17.78 ఉంది.

అల్జీరియాలో రూ.25.10 ఉండగా,

కువైట్ లో రూ.25.18 ఉన్నది.

సూడాన్ లో రూ.27.50,

నైజీరియాలో రూ.31.65 గా ఉన్నది.

మనదేశంలో ఒక్క ఫిబ్రవరిలో ఇప్పటివరకు పెట్రోల్ రూ. 3.24, డీజిల్ రూ.3.47 చొప్పున పెరిగింది. మొత్తంమీద ఏడాది కాలంలో పెట్రోల్ ధర లీటరుకు రూ .17 పెరిగి వినియోగదారులను ఆందోళన పరుస్తోంది.