విమానం ఎక్కగానే సరికాదు సభ్యత ఉండాలి

  • Published By: chvmurthy ,Published On : February 16, 2020 / 09:29 AM IST
విమానం ఎక్కగానే సరికాదు సభ్యత ఉండాలి

సాధారణంగా చాలా మంది ప్రయాణం చేయటానికి బస్సు, రైలు, విమానం ఎక్కుతారు. మనం ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది వ్యక్తులు వారి ప్రవర్తనతో …వారి చేష్టలతో ఇతర ప్రయాణికులకు విసుగు తెప్పిస్తుంటారు. ఇంక ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఫోన్ లో అవతలి వాళ్ళతో అదే పనిగా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకోందరు ఫోన్ లోని యూట్యూబ్ లో పాటలు ఫుల్ సౌండ్ తో  ప్లే చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంటారు.

మరి కొందరు సీట్లో కూర్చుని అదే పనిగ కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇంకొందరు ముందు సీట్లను కాళ్లతో తంతూ ఉంటారు.ఇలా వాళ్ల ప్రవర్తనతో ఎందుకు ప్రయాణం చేస్తున్నామా అనే ఫీలింగ్ కలిగిస్తూ ఉంటారు.  మనం నలుగురితో కలిసి ఉన్నాం. మన ఇంట్లో లేము…. మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించకూడదనే కనీస అవగాహన మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. మన ప్రవర్తన వల్ల ఎవరికైనా ఇబ్బందిగా ఉందా….ఏంటి అనే విషయమే పట్టించుకోరు. ఇతరుల ప్రైవసీని భంగం కలిగిస్తున్నామా అనే విషయం కూడా వీళ్లకు పట్టదు. 

ఇదే పరిస్ధితి విమానాల్లోనూ ఉంటోందని తాజాగా అమెరికన్ ఎయిర్ ఫ్లైయిట్ లో ఒక వ్యక్తి చేసిన చేష్టల వల్ల తెలుస్తోంది. ఒక వ్యక్తి తన చేష్టలతో ముందు సీటులో కూర్చున్న మహిళకు ఇబ్బంది కలిగించాడు.  అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  దాదాపు 1.45 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ఒక వ్యక్తి మహిళ కూర్చున్న ముందు సీటును అదేపనిగా తన చేతులతో పంచ్‌లు కొడుతూ చికాకు కలిగించాడు.

అయితే మహిళ మాత్రం అతని చేష్టలతో ఏమాత్రం విసుగు చెందకుండా కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసినా అతన్ని ఏమనకుండా అలాగే మిన్నకుండిపోయింది. అయితే ఇదంతా మహిళ పక్కనే కూర్చున్న అమైకా అలీ అనే యువతి వీడియో తీసి తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

అతని చేష్టలు చిన్నపిల్లాడిని గుర్తుచేస్తున్నాయి. వేరేవాళ్ల సంగతేమో కానీ నాకు మాత్రం అతని చేసిన పని న్యూసెన్స్‌గా అనిపించింది. అయితే నా పక్కనున్న మహిళ మాత్రం అతన్ని ఏమనకుండా అలాగే ఉండిపోవడం ఆశ్చర్యంగా ఉంది’ అంటూ క్యాప్షన్‌ పెట్టారు. అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తూ..’ఇలాంటి వారిని ఫ్లైట్‌ ఎందుకు ఎక్కనిస్తారు… అతని చేష్టలు చిన్నపిల్లాడిని తీరును తలపిస్తుంది… ఆ వ్యక్తి అంతగా చికాకు పెడుతున్నా మహిళ ఏమనకపోవడం ఆమె నిబద్ధతకు నిదర్శనం’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.