ఇండియాలో ఇదే ఫస్ట్ : Vistara విమానాల్లో Wi-Fi ఇంటర్నెట్ సేవలు

  • Published By: sreehari ,Published On : September 19, 2020 / 03:36 PM IST
ఇండియాలో ఇదే ఫస్ట్ : Vistara విమానాల్లో Wi-Fi ఇంటర్నెట్ సేవలు

భారతీయ వైమానిక సంస్థ విస్తారా తమ ఎయిర్ లైన్ సర్వీసులో ఇంటర్నెట్ సేవలు ఆఫర్ చేస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం విస్తారా తమ ఎయిర్ లైన్‌లో Wi-Fi ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. దీంతో విస్తారా విమానంలో ఇంటర్నెట్ సేవలను అందించే మొట్టమొదటి భారతీయ ఎయిర్ లైన్ కంపెనీగా అవతరించింది.



బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్స్ విమానం సర్వీసుతో ఈ ఇంటర్నెట్ సేవలను విస్తారా ప్రారంభించింది. సెప్టెంబర్ 18 నుంచి విస్తారా ఆఫర్ అందుబాటులోకి వచ్చేసింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో నుంచి ఢిల్లీ-లండన్ హెత్రో (LHR) మధ్య నడిచే విమాన సర్వీసుల్లో ఈ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి.



విస్తారా విమాన ప్రయాణికులకు ఈ ఆఫర్ ఉచితంగా అందిస్తోంది. కాకపోతే పరిమిత సమయం మాత్రమే.. ఎయిర్ బస్ A321నియో ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసుల్లో కూడా విస్తారా వై-ఫై ఇంటర్నెట్ సేవల కోసం ప్లాన్ చేస్తోంది.



విస్తారా విమానాల్లో ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్స్ వైఫై సేవలను వినియోగించుకోవచ్చు. భూమి నుంచి 35,000 అడుగుల ఎత్తులో విస్తారా కస్టమర్లు ఈ ఇంటర్నెట్ సేవలను వినియోగించు కోవచ్చు.



Vistara Airline అందించే సర్వీసుల్లో ఎంటర్ టైన్మెంట్ కోసం In-Flight Entertainment (IFE) system కూడా అందుబాటులో ఉంది. విస్తారా వినియోగదారులు 700 గంటల పాటు అందించే ప్రత్యేకమైన ప్యాకేజీలో మూవీలు, టీవీ షోలు, ఆడియో, వీడియోలతో పాటు గేమ్స్ కూడా యాక్సస్ చేసుకోవచ్చు.