టాక్ టైమ్ ఈజ్ బ్యాక్ : వోడాఫోన్ 3 రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

వోడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం వోడాఫోన్ మరోసారి టాక్ టైమ్ రీఛార్జ్ ప్యాక్స్ తో ముందుకొచ్చింది. అన్ లిమిటెడ్ ప్యాక్స్ తో యూజర్లను ఆకర్షిస్తున్న పలు నెట్ వర్క్ లు టాక్ టైమ్ బేసిడ్ రీఛార్జ్ లకు స్వస్తి చెప్పేశాయి.

  • Edited By: sreehari , February 1, 2019 / 02:52 PM IST
టాక్ టైమ్ ఈజ్ బ్యాక్ : వోడాఫోన్ 3 రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

వోడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం వోడాఫోన్ మరోసారి టాక్ టైమ్ రీఛార్జ్ ప్యాక్స్ తో ముందుకొచ్చింది. అన్ లిమిటెడ్ ప్యాక్స్ తో యూజర్లను ఆకర్షిస్తున్న పలు నెట్ వర్క్ లు టాక్ టైమ్ బేసిడ్ రీఛార్జ్ లకు స్వస్తి చెప్పేశాయి.

వోడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం వోడాఫోన్ మరోసారి టాక్ టైమ్ రీఛార్జ్ ప్యాక్స్ తో ముందుకొచ్చింది. అన్ లిమిటెడ్ ప్యాక్స్ తో యూజర్లను ఆకర్షిస్తున్న పలు నెట్ వర్క్ లు టాక్ టైమ్ బేసిడ్ రీఛార్జ్ లకు స్వస్తి చెప్పేశాయి. రూ.10 రీఛార్జ్ ప్యాక్ మినహా మిగతా ప్యాక్ లన్నీ అన్ లిమిటెడ్ బేసిడ్ ప్యాక్స్ మాత్రమే అందిస్తున్నాయి.

దీంతో యూజర్లు ప్యాక్ యాక్టివేట్ చేయించుకోవాలంటే అన్ లిమిటెడ్ ప్యాక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వోడాఫోన్ .. రూ. 10 రీఛార్జ్ ప్లాన్ పై (రూ.7.47 టాక్ టైమ్) ఇస్తుండగా.. మరో మూడు టాక్ టైమ్ బేసిడ్ రీఛార్జ్ ప్యాకులను తిరిగి తీసుకొచ్చింది.  రూ.50, రూ.100, రూ.500 ఇలా మూడు ప్యాకులపై వ్యాలీడెటీ 84 రోజుల వరకు ఉంటుంది. 

రూ.50 రీఛార్జ్ చేసుకుంటే రూ.39.37 టాక్ టైమ్ వస్తుంది. యాక్టివేట్ ఛార్జ్ రూ.3తో కలిపి జీఎస్టీ రూ. 7.63 వరకు ఛార్జ్ చేస్తారు. రూ.100, రూ.500 రీఛార్జ్ ప్యాక్ లపై ఫుల్ టైమ్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో రూ.50, రూ.100 రీఛార్జ్ ప్యాక్ లపై ఔట్ గోయింగ్ వ్యాలిడెటీ మాత్రం 28 రోజులు మాత్రమే. రూ. 500 రీఛార్జ్ ప్లాన్ పై మాత్రమే 84 రోజుల కాల పరిమితి ఉంది. గతవారమే భారతీ ఎయిర్ టెల్ తమ కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా రూ.100, రూ.500 రీఛార్జ్ ప్లాన్లను తిరిగి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.  

Read Also:  కండిషన్స్ అప్లై: వోడాఫోన్ కొత్త రీఛార్జ్ ప్లాన్

Read Also:  ఓపిక పట్టండీ : 3 నెలల్లో భారీగా తగ్గనున్న DTH ఛానళ్ల ధరలు

Read Also:  జియో ఆస్తులు అమ్ముతున్న అంబానీ