బ్రేకింగ్ : డిసెంబర్ 1 నుంచి మొబైల్ టారిఫ్ రేట్లు పెంపు

  • Published By: sreehari ,Published On : November 18, 2019 / 01:27 PM IST
బ్రేకింగ్ : డిసెంబర్ 1 నుంచి మొబైల్ టారిఫ్ రేట్లు పెంపు

మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్. డిసెంబర్ 1 నుంచి మొబైల్ సర్వీసు రేట్లు పెరగనున్నాయి. టెలికం అతిపెద్ద దిగ్గజం వోడాఫోన్ ఇండియా త్వరలో మొబైల్ సర్వీసు టారిఫ్స్ రేట్లను పెంచనున్నట్టు ప్రకటించింది. వరల్డ్ క్లాస్ డిజిటల్ ఎక్స్ పీరియన్స్ ఎంజాయ్ చేసేందుకు వీలుగా కస్టమర్లకు ఈ నిర్ణయం తీసుకుంది. వోడాఫోన్ ఐడియా పెంచే టారిఫ్స్ వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

వోడాఫోన్-ఐడియా (VIL) స్టాక్స్ సోమవారం ఒక్కసారిగా పెరిగాయి. ప్రభుత్వం నేతృత్వంలో తిరిగి పుంజుకోవడంతో NSEపై ముదుపుదారులు ఆసక్తి కనబర్చారు. ఫలితంగా వోడాఫోన్-ఐడియా షేర్లు 18శాతం మేర పురోగమించాయి. నష్టాల్లో కూరుకుపోయిన ఏ టెలికం కంపెనీ కార్యకలాపాలన్నీ మూతపడాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన కొన్ని గంటల తర్వాత వోడాఫోన్-ఐడియా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. 

మొబైల్ సర్వీసు కవరేజీతో పాటు సామర్థ్యాన్ని కూడా వేగవంతంగా విస్తరించనున్నామని వోడాఫోన్ ఐడియా తెలిపింది. మార్చి 2020 నాటికి (1 బిలియన్) 100 కోట్ల భారతీయ యూజర్లకు 4G సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నట్టు వోడాఫోన్ ఐడియా స్పష్టం చేసింది. 

AGR పెండింగ్‌లో ఉన్న బకాయిలను కేటాయించడంతో టెలికం దిగ్గజాలైన ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా కలిసి (Q2)రెండో త్రైమాసికంలో రూ.74వేల కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి. టెలికం రంగంలో ఉపశమనం రాకపోతే అదే ఆందోళన ఉండబోదని వోడాఫోన్ సూచించింది.

టెలికాం రంగంలో వొడాఫోన్ ఐడియా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఉందని వాటాదారులంతా అంగీకరించారు. దీనిపై క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కార్యదర్శుల కమిటీ (CoS) కంపెనీకి తగిన ఉపశమనం కల్పించే దిశగా చూస్తోంది.