TERI-IWA-UNDP: వాటర్‌ సస్టెయినబిలిటీ అవార్డు గెలుచుకున్న అల్ట్రాటెక్‌

పాక్షిక, తీవ్ర కరువు ప్రాంతాలున్నటి వంటి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో నీటి కొరత సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రి వద్దనున్న ఆంధ్రప్రదేశ్‌ సిమెంట్‌ వర్క్స్‌ (ఏపీసీడబ్ల్యు), అయ్యవారిపల్లి (అనంతపూర్‌ జిల్లా) పెట్నికోట (నందాల్య జిల్లా) గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో దత్తత తీసుకోవడంతో పాటుగా ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌ అమలు చేసింది

TERI-IWA-UNDP: వాటర్‌ సస్టెయినబిలిటీ అవార్డు గెలుచుకున్న అల్ట్రాటెక్‌

Water Sustainability Award-winning Ultratech

TERI-IWA-UNDP: భారతదేశంలో అతిపెద్ద సిమెంట్‌, ఆర్‌ఎంసీ కంపెనీ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లిమిటెడ్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన TERI-IWA-UNDP వాటర్‌ సస్టెయినబిలిటీ అవార్డు 2022ను గెలచుకుంది. ఎనర్జీ అండ్‌ రిసోర్స్‌ ఇనిస్టిట్యూట్‌ (TERI), ఇంటర్నేషనల్‌ వాటర్‌ అసోసియేషన్‌ (IWA), యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (UNDP) సహకారంతో అంతర్జాతీయ నీటి దినోత్సవం 2023 సందర్భంగా అందజేసింది.

Megamsh Srihari : శ్రీహరి కొడుకు మేఘాంశ్ “మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?” మూవీ ఓపెనింగ్ గ్యాలరీ..

ఈ అవార్డును అల్ట్రాటెక్‌కు రెండవ వాటర్‌ సస్టెయినబిలిటీ అవార్డులు 2022–2023 వేడుకలో అందజేశారు. న్యూఢిల్లీలో ఈ కార్యక్రమం మార్చి 21,2023 వద్ద జరిగింది. అల్ట్రాటెక్‌ను ‘వాటర్‌ ఫర్‌ ఆల్‌’ విభాగం కింద గుర్తించారు. అల్ట్రాటెక్‌ యొక్క ఇంటిగ్రేటెడ్‌ సిమెంట్‌ తయారీ యూనిట్‌ ఆంధ్రప్రదేశ్‌ సిమెంట్‌ వర్క్స్‌ తమ యూనిట్‌కు దగ్గరలోని రెండు గ్రామాలలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌ కోసం ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిటీ నీటి నిర్మాణాలను కాపాడటంతో పాటుగా పునరుద్ధరించడాన్ని, స్థానిక ప్రజల జీవితాలు, జీవనోపాధి వృద్ధి చేయడం లక్ష్యంగా చేసుకున్నారు.

Atiq Ahmed: హై టెన్షన్, ప్రాణ భయం మధ్య ఎట్టకేలకు యూపీ చేరుకున్న గ్యాంగ్‭స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్

పాక్షిక, తీవ్ర కరువు ప్రాంతాలున్నటి వంటి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో నీటి కొరత సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రి వద్దనున్న ఆంధ్రప్రదేశ్‌ సిమెంట్‌ వర్క్స్‌ (ఏపీసీడబ్ల్యు), అయ్యవారిపల్లి (అనంతపూర్‌ జిల్లా) పెట్నికోట (నందాల్య జిల్లా) గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో దత్తత తీసుకోవడంతో పాటుగా ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌ అమలు చేసింది. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సంవత్సరానికి 30% చొప్పున అడుగంటి పోతున్నాయి. ఈ యూనిట్‌ ఇంటర్నేషనల్‌ క్రాప్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ద సెమి–అరిడ్‌ ట్రోపిక్స్‌ (ఇక్రిశాట్‌)తో భాగస్వామ్యం చేసుకుని ఈ ప్రాజెక్ట్‌ అమలు చేయడంతో పాటుగా నీటి కొరత, భూసార క్షీణత, తక్కువ పంట దిగుబడి సమస్యలను పరిష్కరించడం ద్వారా గ్రామస్తుల ఆదాయ స్థాయి, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.