Tax Returns : జాబ్ చేస్తున్నారా? మీకు Form 16 అంటే ఏంటో తెలుసా?

మీరు ఉద్యోగం చేస్తున్నారా? అయితే నెల జీతం తీసుకుంటున్నారుగా? అయితే మీ నెలజీతం ఆధారంగా మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సి రావొచ్చు.

Tax Returns : జాబ్ చేస్తున్నారా? మీకు Form 16 అంటే ఏంటో తెలుసా?

What Is Form 16 Everything About Form 16

Form 16 : మీరు ఉద్యోగం చేస్తున్నారా? అయితే నెల జీతం తీసుకుంటున్నారుగా? అయితే మీ నెలజీతం ఆధారంగా మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సి రావొచ్చు. సాధారణంగా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేవారికి ఈ Form 16 అంటే బాగా తెలుసు.. జీతాలను చెల్లించే సమయంలో ఈ ఫారం 16 ఇస్తుంటారు. అలాగే ఇతర చెల్లింపులకు ఇచ్చే ఫారం 16Aగా పిలుస్తారు. అలాగే TDS సర్టిఫికేట్ కూడా ఉంటుంది. మీకు వేతనంగా చెల్లించే మొత్తంలో కోత విధిస్తారు. దాన్నే టీడీఎస్ అంటారు. చెల్లింపులు జరిపే వ్యక్తి చట్టప్రకారం కొంత మొత్తం పన్నుగా మినహాయించడం జరుగుతుంది. రికవరీ చేసిన మొత్తాన్ని సకాలంలో గవర్నమెంటుకు చెల్లించాల్సి ఉంటుంది. రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే స్టేట్‌మెంటును రెడీ చేస్తారు. TDS స్టేట్‌మెంట్లగా పిలుస్తారు.
Maa Election: ప్రకాష్ రాజ్ ప్యానల్ నామినేషన్ల దాఖలు.. ఇక సమరమే?

ఇందులోనే ఆదాయం వివరాలు, స్వభావం, కోత మొత్తం, చలానా వివరాలు, అస్సెస్సీ పేరు, పాన్, అసెస్‌మెంటు ఏడాది వంటి వివరాలు ఉంటాయి. ఆదాయ పన్ను శాఖ అన్నింటినుంచి సేకరించిన డేటాతో ప్రతి అస్సెస్సీకి ఒక సమగ్రమైన పట్టికను రెడీ చేస్తారు. అదే 26CAH.. అస్సెస్సీకి సంబంధించిన ఆదాయ వివరాలు, TDS, TCS, అస్సెస్సీ చెల్లించిన పన్ను వివరాలు ఉంటాయి. ఫారం 16/16A లోని వివరాలు, ఫారం 26A వివరాలు సరిపోలేలా ఉండాలి. ఇందులో ఎలాంటి తేడాలు ఉండకుండా చూసుకోవాలి.

ప్రధానంగా డిడక్ట్‌ చేసిన వ్యక్తి చెల్లించకపోయినా, రిటర్నులు పూర్తి చేయడంలో ఏమైనా తప్పులు ఉండటం, పాన్‌ నంబర్ తప్పుగా నమోదు చేయడం, టాన్‌ నంబర్‌ లో తప్పులు, చలాన్ల వివరాల్లో తప్పులు దొర్లటం, అసెస్‌మెంటు ఏడాదిని తప్పుగా పొందుపరచడం, అడ్రస్‌లు తప్పుగా ఉండటం, అస్సెస్సీ పేర్లు తప్పుగా ఉండటం, పూర్తి వివరాలు రాయకపోవడం, పన్నుల మొత్తంలో తప్పులు ఉండటం అనేక సమస్యలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఇలాంటి తేడాలు వస్తే.. మీరు ఫారం 16, ఫారం 16A జారీ చేసిన వారిని సంప్రదించాల్సి ఉంటుంది.  వెంటనే అందులోని తప్పులను సరిదిద్దించుకోవాలి. ఆదాయ శాఖకు తగిన కారణాలు వివరణ ఇవ్వాలి. తప్పులను వెంటనే ‘రీకన్సిలేషన్‌’ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ ఫారం 26Aలో ఏమైనా తేడాలు ఉంటే.. ప్రీఫిల్డ్ ఫారాలు ఉంటాయి. వెంటనే ఆ తప్పులను సరిదిద్దుకోవచ్చు. డిడక్టర్‌ అందించాల్సిన వివరాలు ఇవ్వకపోయినా ఇబ్బందేనని గుర్తించాలి. తప్పులను సరిదిద్దుకునేందుకు అస్సెస్సీలకు డిపార్ట్‌మెంటు అధికారులు సమయం ఇవ్వాలి.
Telangana Assembly : ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి రాష్ట్రాభివృద్ధి కోసమే : మంత్రి కేటీఆర్