బడ్జెట్ 2019: హోం లోన్స్ పై రియల్ ఎస్టేట్ అంచనాలు!

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ బడ్జెట్ వైపు ఎన్నో రంగాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కేంద్రం ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

  • Published By: sreehari ,Published On : January 30, 2019 / 09:11 AM IST
బడ్జెట్ 2019: హోం లోన్స్ పై రియల్ ఎస్టేట్ అంచనాలు!

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ బడ్జెట్ వైపు ఎన్నో రంగాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కేంద్రం ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

బడ్జెట్ 2019: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ బడ్జెట్ వైపు ఎన్నో రంగాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కేంద్రం ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. జీఎస్ టీ నుంచి (వస్తు సేవల పన్ను) నుంచి గృహ రుణాలపై వడ్డీ మినహాయింపు వరకు ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఆర్థిక సంవత్సరం 2019-2020 మధ్యంతర బడ్జెట్ తమ సంస్థ అభివృద్ధికి ఎలా చేయూతనిస్తుందనే ఆశగా వీక్షిస్తున్నాయి. 2018 సమయంలో భారత్ లో రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఉత్సహాన్ని నింపింది. 2017లో ఆర్ఈఆర్ఏ, జీఎస్టీ, డిమానిటైజేషన్ వంటి కీలక సంస్కరణలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. 2019లోనైనా కేంద్రం ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ అనుకూలంగా ఉంటుందని రియల్ రంగం భావిస్తోంది. 

రియల్ సెక్టార్ కు స్టేటస్: రియల్ రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ కేటాయించాలనే ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది. ఈ స్టేటస్ ఉంటే తప్ప రియల్ సెక్టార్ బ్యాంకు, ఫైనాన్స్ సెక్టార్ల నుంచి సులవుగా లోన్స్ పొందే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీకే లోన్లు పొందే సౌలభ్యం లభిస్తుంది. దేశంలోనే రెండో అతిపెద్ద రియల్టర్లు ఉన్న రియల్ రంగంలో దేశవ్యాప్తంగా 130వరకు ఉన్న అనుబంధ సంస్థలకు, కస్టమర్లకు మేలు చేకూరుతుందని రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు. 

రియల్ పై జీఎస్టీ తగ్గేనా: రియల్ రంగంపై కేంద్రం బడ్జెట్ లో జీఎస్టీ తగ్గించే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది.  దీంతో నిర్మాణంలో ఉన్న ప్లాట్లపై 12 శాతం నుంచి 5 శాతంగా తగ్గనుంది. అలాగే క్యాపిటల్ గూడ్స్, ఇన్ పుట్ సర్వీసులపై కూడా జీఎస్టీ తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

హోం లోన్లపై వడ్డీ రాయితీ పెంపు: కేంద్ర బడ్జెట్ లో రియల్ రంగంలో హోం లోన్లు తీసుకున్న కొనుగోలుదారులకు వడ్డీ రేటులో రాయితీ పెంచుతారని భావిస్తున్నారు. హౌసింగ్ లోన్లలో వడ్డీపై విధించే పన్ను పరిమితిని ప్రభుత్వం పెంచినట్టయితే.. దేశవ్యాప్తంగా మిలియన్ల మంది కొనుగోలుదారులకు ఎంతో మేలు చేకూరనుంది. ప్రస్తుతం హోం లోన్లపై ఏడాదికి పన్ను రాయితీ పరిమితి రూ.1.5 లక్షలు ఉండగా.. దాన్ని రూ.5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది. 

సింగిల్ విండో క్లియరెన్స్ అత్యవసరం: రియల్ ప్రాజెక్టులపై సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అమల్లోకి రావాల్సి ఉంది. ఈ సింగిల్ విండో క్లియరెన్స్ మెకానిజం రావడం వల్ల రియల్ ప్రాజెక్టుల టైమ్ లైన్ పెరగడమే కాకుండా రియల్ రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఫలితంగా రియల్టర్లు, వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. రెసిడెన్షియల్ ప్రాజెక్టుల ఆమోదం విషయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించే దిశగా 2019 బడ్జెట్ లో ప్రభుత్వం ఏదైనా కొత్త విధానాన్ని తీసుకొస్తుందో అంచనాలు నెలకొన్నాయి. ఈ విధానంతో రియల్ ప్రాజెక్టుల ఆమోదానికి అనుమతులు పొందేందుకు ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం ఉపకరించే అవకాశం కనిపిస్తోంది. 

గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకం: రియల్ రంగంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభంలో హౌసింగ్, డెవలపర్లకు ఈ బడ్జెట్ ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రీన్ బిల్డింగ్ నిర్మాణాలపై ఖర్చు అధికంగా ఉండటంతో మెజార్టీ డెవలపర్లు ఇందులో పెట్టుబడి పెట్టేందుకు జంకుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం వీరిని ప్రోత్సహించే దిశగా ఈ బడ్జెట్ లో ఎస్ఐ, పన్ను రాయితీలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేగాని జరిగితే గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీపై రియల్టర్లంతా దృష్టి సారించి పెట్టుబడులకు ముందుకొస్తారని ప్రభుత్వం భావిస్తోంది.