Final Warning : PAN-Aadhaar లింక్ చేయకపోతే జరిగే నష్టాలు ఇవే

డెడ్ లైన్ సమీపిస్తోంది. కొన్ని గంటల్లో గడువు పూర్తవుతుంది. డిసెంబర్ 31 ముగుస్తుంది. ఆ తర్వాత న్యూఇయర్ 2020 లోకి అడుగుపెడతాం. పాన్ తో ఆధార్ లింకింగ్ కు గడువు

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 07:14 AM IST
Final Warning : PAN-Aadhaar లింక్ చేయకపోతే జరిగే నష్టాలు ఇవే

డెడ్ లైన్ సమీపిస్తోంది. కొన్ని గంటల్లో గడువు పూర్తవుతుంది. డిసెంబర్ 31 ముగుస్తుంది. ఆ తర్వాత న్యూఇయర్ 2020 లోకి అడుగుపెడతాం. పాన్ తో ఆధార్ లింకింగ్ కు గడువు

డెడ్ లైన్ సమీపిస్తోంది. కొన్ని గంటల్లో గడువు పూర్తవుతుంది. డిసెంబర్ 31 ముగుస్తుంది. ఆ తర్వాత న్యూఇయర్ 2020 లోకి అడుగుపెడతాం. పాన్ తో ఆధార్ లింకింగ్ కు గడువు 2019 డిసెంబర్ 31. ఇంకా చెయ్యని వారు ఎవరైనా ఉంటే.. వెంటనే ఆ పని చెయ్యండి. ఇప్పటికే చాలామంది పాన్-ఆధార్ లింక్ చేశారు. కానీ ఇంకా ఈ పని చెయ్యని వారు ఉన్నారు. అసలు పాన్-ఆధార్ ఎందుకు లింక్ చెయ్యాలి? చెయ్యకపోతే ఏమవుతుంది? ఏం నష్టం జరుగుతుంది…? ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలి.? అనే వివరాల్లోకి వెళితే..

పాన్-ఆధార్ అనుసంధానం చెయ్యకపోతే కలిగే నష్టాలు:
* పాన్ తో ఆధార్ అనుసంధానం చెయ్యకపోతే.. జనవరి 1, 2020 నుంచి పాన్ కార్డు చెల్లుబాటు (ఇన్ ఆపరేటివ్) కాదు
* పాన్ కార్డు ఉన్నా లేనట్టే
* ఆర్థిక లావాదేవీలు చెయ్యడానికి వీలు కాదు
* ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ఐటీఆర్) ఫైల్ చెయ్యలేరు
* పాన్ కార్డు చెల్లుబాటు కాకుంటే అధిక పన్నులు కట్టాల్సి వస్తుంది
* ట్యాక్సులు చెల్లించ లేరు
* ఎక్కువ పాన్ కార్డులు ఉండటం నేరం.. రూ.10వేలు ఫైన్

పాన్-ఆధార్ అనుసంధానం రూల్ 2019 సెప్టెంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. ఆధార్, పాన్ కార్డు.. కీలకమైన డాక్యుమెంట్లలో ఇవి రెండూ టాప్‌లో ఉంటాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చాలా పనుల్లో వీటి అవసరం ఎక్కువ. ఇవి లేనిదే పనులు జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిబంధన ప్రకారం.. 2019 డిసెంబర్ 31లోపు పాన్, ఆధార్ లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు ఇన్‌యాక్టివ్ అవుతుంది.

ఇకపోతే.. అనేక సందేహాలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డిసెంబర్ 31 తర్వాత అంటే.. 2020లో ఆధార్-పాన్ కార్డులను లింక్ చేసుకుంటే.. అప్పుడు మళ్లీ పాన్ కార్డు రీయాక్టివేట్ అవుతుందా? లేదా?… కొత్త పాన్ కార్డుకు అప్లయ్ చేసుకోవచ్చా..? లేదా? ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అలాగే ఇన్ఆపరేటివ్ అనే పదానికి నిర్వచనం చెప్పాల్సి ఉంది.

పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇంటర్ ఛేంజ్‌బిలిటీని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసింది. అంటే పాన్ కార్డు అవసరమైన చోట ఆధార్ నెంబర్ ఇవ్వొచ్చు. అయితే పాన్-ఆధార్ లింక్ చేసుకోని సందర్భంలో.. పాన్ కార్డు చెల్లుబాటు కానప్పుడు.. అప్పుడు కూడా పాన్ బదులు ఆధార్ నెంబర్ ఉపయోగించవచ్చా? లేదా? అనే అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. పాన్-ఆధార్ లింకింగ్ రూల్ ను కేంద్ర ప్రభుత్వం ఇంకా నోటిఫై చేయనందున రెండింటి అనుసంధానానికి గడువును మరోసారి పొడిగించే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేశారు. ఏది ఏమైనా.. వీలైనంత త్వరగా పాన్, ఆధార్ నెంబర్లను అనుసంధానం చేసుకోవడం అన్ని రకాలు శ్రేయస్కరం అని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : డెబిట్ కార్డులున్నవారికి హెచ్చరిక..EMV లేకపోతే బ్లాక్