Whatsapp: వాట్సాప్‭లో అదిరిపోయే ఫీచర్.. రెండు ఫోన్లలో ఒకటే అకౌంట్

ఈ సరికొత్త అప్‌డేట్‌పై వాట్సప్ పనిచేస్తోందని జీఎస్ఎం అరెనా అనే రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఫీచర్‌తో ఒకే వాట్సప్ అకౌంట్‌ను వేరే స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేసుకోవచ్చునని పేర్కొంది. ప్రస్తుతానికి బీటా వెర్సన్ 2.22.24.18 ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందని ఆ సంస్థ తెలిపింది. కాగా, వాట్సప్ ప్రైమరీ అకౌంట్‌ను నాలుగు ఆండ్రాయిడ్ ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చునని బీటా వెర్షన్ అప్‌డేట్ పేర్కొంది

Whatsapp: వాట్సాప్‭లో అదిరిపోయే ఫీచర్.. రెండు ఫోన్లలో ఒకటే అకౌంట్

whatsapp single account in duel mobile

Whatsapp: మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఒక వాట్సప్ అకౌంట్‌ను ఒక ఫోన్‌పై మాత్రమే ఉపయోగించే వీలుంది. రెండు వేర్వేరు ఫోన్లపై ఒకే అకౌంట్‌ను వాడడం అసాధ్యం. అయితే త్వరలోనే ఇది సాధ్యమవబోతోందని మెటా సంస్థ తాజాగా ప్రకటించింది. సులభతర, నిరంతరాయం సేవలకు ప్రాధాన్యతనిచ్చే వాట్సప్ త్వరలోనే ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌లో ఒకే అకౌంట్‌ను రెండు వేర్వేరు ఫోన్లపై ఉపయోగించవచ్చు. సెకండరీ డివైజ్ లేదా ఆండ్రాయిడ్ టాబ్లెట్‌కు తమ అకౌంట్‌ను లింక్ చేసుకునే వీలు ఉంటుంది.

ఈ సరికొత్త అప్‌డేట్‌పై వాట్సప్ పనిచేస్తోందని జీఎస్ఎం అరెనా అనే రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఫీచర్‌తో ఒకే వాట్సప్ అకౌంట్‌ను వేరే స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేసుకోవచ్చునని పేర్కొంది. ప్రస్తుతానికి బీటా వెర్సన్ 2.22.24.18 ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందని ఆ సంస్థ తెలిపింది. కాగా, వాట్సప్ ప్రైమరీ అకౌంట్‌ను నాలుగు ఆండ్రాయిడ్ ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చునని బీటా వెర్షన్ అప్‌డేట్ పేర్కొంది. లింక్ చేసిన డివైజ్‌పై కూడా అన్ని ఫీచర్లను పొందొచ్చని వెల్లడించింది. అయితే ఐఫోన్లు, యాపిల్ పరికరాలపై ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తారా లేదా అనే విషయం ఇంకా స్పష్టం చేయలేదు.

Vikram S: నింగిలోకి దూసుకెళ్లనున్న భారత మొదటి ప్రైవేట్ రాకెట్