అప్ గ్రేడ్ చేయలేదా? : ఐఫోన్లలో ఇక WhatsApp పనిచేయదు!

ఐఫోన్ యూజర్లకు బ్యాడ్ న్యూస్. మీరు వాడే ఐఫోన్లలో వాట్సాప్ సర్వీసు పూర్తిగా నిలిచిపోయింది.

  • Published By: sreehari ,Published On : February 8, 2020 / 01:07 AM IST
అప్ గ్రేడ్ చేయలేదా? : ఐఫోన్లలో ఇక WhatsApp పనిచేయదు!

ఐఫోన్ యూజర్లకు బ్యాడ్ న్యూస్. మీరు వాడే ఐఫోన్లలో వాట్సాప్ సర్వీసు పూర్తిగా నిలిచిపోయింది.

ఐఫోన్ యూజర్లకు బ్యాడ్ న్యూస్. మీరు వాడే ఐఫోన్లలో వాట్సాప్ సర్వీసు పూర్తిగా నిలిచిపోయింది. చెక్ చేసుకున్నారా?  మీ ఐఫోన్.. కొత్త వెర్షన్ కు అప్ గ్రేడ్ చేసుకోలేదా? వెంటనే అప్ గ్రేడ్ చేసుకోండి. లేదంటే.. మీ ఐఫోన్లో వాట్సాప్ పనిచేయదు. ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్.. ఫిబ్రవరి 1, 2020 నుంచి పాత ఐఫోన్లలో సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్ నుంచి కొత్త అప్ డేట్స్ ఆయా వెర్షన్ ఐఫోన్లకు అందుబాటులో ఉండవు అని ఓ రిపోర్టు తెలిపింది. కొత్త వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఫోన్లలో మాత్రమే వాట్సాప్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 

ప్రస్తుతం ఐఫోన్ iOS 8 డివైజ్ ల్లో వాట్సాప్ సర్వీసు యాక్టివ్ గా ఉంది. ఫిబ్రవరి 1, 2020 నుంచి ఈ డివైజ్ ల్లో వాట్సాప్ సర్వీసు నిలిపివేసినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వాట్సాప్ యాక్సస్ చేసుకోవాలంటే.. ఐఫోన్లలో iOS 9 లేదా తర్వాతి వెర్షన్లలో మాత్రమే పనిచేస్తుంది. iOS 8 ఐఫోన్లలో వాట్సాప్ అకౌంట్ ఉంటే.. కొత్త అకౌంట్ క్రియేట్ చేయడం లేదా రీవెరిఫై చేసుకోవడం కుదరదు.

వాట్సాప్ రన్ చేయాలంటే iOS 9 వెర్షన్ లేదా ఆపై వెర్షన్లలో మాత్రమే సాధ్యపడుతుంది. లేటెస్ట్ iOS వెర్షన్ అప్ డేట్ చేసుకోవడం ద్వారా వాట్సాప్ సర్వీసులను నిరంతరాయంగా వినియోగించుకోవచ్చు. ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ లను మాడిఫై చేసిన డివైజ్ ల్లో కూడా వాట్సాప్ సర్వీసులు నిలిపివేసినట్టు సంస్థ పేర్కొంది. 

మరోవైపు ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా వాట్సాప్ అలర్ట్ చేసింది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.7 లేదా అంతకంటే పాత ఆండ్రాయిడ్ వెర్షన్ ల్లో కూడా కొత్త వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోలేరని, ఎగ్జిస్టింగ్ అకౌంట్లను రీవెరిఫై చేసుకోలేరని వాట్సాప్ స్పష్టం చేసింది.

ఈ డివైజ్ ల్లో కూడా ఫిబ్రవరి 1 వరకు మాత్రమే వాట్సాప్ పనిచేసింది. సెప్టెంబర్ 20న ఆపిల్ కంపెనీ కొత్త ఐఫోన్ 11 సిరీస్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్.. ఈ డివైజ్ ల్లో iOS 13 లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. ఈ ఓఎస్ 6S నుంచి ఆపై వెర్షన్ ఓఎస్ లతో పాటు 14iPhone మోడల్స్ పై కూడా సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ SEపై కూడా ఈ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది.