Whatsapp: వాట్సాప్‭లో మరో కొత్త ఫీచర్.. ఇక నుంచి లాక్ ఉంటేనే యాప్ ఓపెన్

ఇప్పటి వరకు ఇలాంటి సెక్యూరిటీ లేదు. ఒక్కసారి డెస్క్‭టాప్‭లో లాగిన్ అయితే చాలు, మళ్లీ లాగౌట్ కొట్టేంత వరకు ఓపెన్ అయే ఉంటుంది. దీంతో వినియోగదారులు లాగౌట్ కొట్టడం మర్చిపోతే వారి ప్రైవసీకి ప్రమాదం ఉందనే వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకే కొత్త ఫీచర్ తీసుకు వస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో మెటా యాజమాన్యం పేర్కొంది.

Whatsapp: వాట్సాప్‭లో మరో కొత్త ఫీచర్.. ఇక నుంచి లాక్ ఉంటేనే యాప్ ఓపెన్

WhatsApp`s new feature to help desktop users protect chat screens using password

Whatsapp: మెటా సంస్థకు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‭ తీసుకువచ్చింది. ఇప్పటిలా కాకుండా ఇక నుంచి వాట్సాప్ ఓపెన్ చేయాలంటే స్క్రీన్ లాక్ తీయాల్సిందేనని సంస్థ తాజాగా పేర్కొంది. స్క్రీన్ అనే పేరుతోనే తీసుకువస్తున్న ఈ ఫీచర్‭తో డెస్క్‭టాప్‭లో యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి పాస్‭వర్డ్ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సిందేనట. యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ ఫీచర్ తీసుకు వచ్చినట్లు మెటా సంస్థ పేర్కొంది. ఈ కొత్త ఫీచర్ వల్ల అదనపు భద్రత లభిస్తుందని చెబుతున్నారు.

అయితే ఈ ఫీచర్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉందట. టెస్టింగ్ పూర్తైతే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. నంబర్ లేదంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ భద్రతలో స్ర్కీన్ లాక్ తీసుకు వస్తున్నారట. ఒకవేళ యూజర్ పాస్‭వర్డ్ మర్చిపోతే యాప్ నుంచి లాగౌట్ చేసి, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా మళ్లీ లాగిన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

అయితే ఇప్పటి వరకు ఇలాంటి సెక్యూరిటీ లేదు. ఒక్కసారి డెస్క్‭టాప్‭లో లాగిన్ అయితే చాలు, మళ్లీ లాగౌట్ కొట్టేంత వరకు ఓపెన్ అయే ఉంటుంది. దీంతో వినియోగదారులు లాగౌట్ కొట్టడం మర్చిపోతే వారి ప్రైవసీకి ప్రమాదం ఉందనే వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకే కొత్త ఫీచర్ తీసుకు వస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో మెటా యాజమాన్యం పేర్కొంది.

Isha Ambani: కవలలకు జన్మనిచ్చిన ఈషా అంబానీ.. ఒకే కాన్పులో పాప, బాబు.. చిన్నారులకు పేర్లు పెట్టేసిన అంబానీ