పెట్రోల్ తగ్గుతోంది.. LPG ధర పెరుగుతోంది.. ఎందుకిలా?

  • Published By: sreehari ,Published On : February 13, 2020 / 12:30 PM IST
పెట్రోల్ తగ్గుతోంది.. LPG ధర పెరుగుతోంది.. ఎందుకిలా?

దేశంలో రోజురోజుకీ పెట్రోల్ ధరలు తగ్గుతున్నాయి. కానీ, ఎల్‌పీజీ ధరలు మాత్రం పైపైకి పెరిగిపోతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ ధర తగ్గించి.. నాన్ సబ్సిడీ సిలిండర్ల ధరలను పెంచుతున్నాయి. బుధవారం మరోసారి ఎల్ పీజీ సిలిండర్ ధర పెరిగింది. కొన్ని నెలల్లో ఇలా LPG ధర పెరగడం ఆరోసారి. ప్రపంచ స్థాయిలో చమురు ధరలు పెరిగిపోవడంతో దేశంలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.144.5 వరకు పెరిగింది. ప్రస్తుతం ఎల్ పీజీ ధరల్లో ఢిల్లీలో ఒక్కో సిలిండర్ ధర రూ.858.50లుగా ఉంది. గతంలో దీని ధర రూ.714గా ఉంది.

వాస్తవానికి.. జనవరి 2014 నుంచి ఎల్ పీజీ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో ఒక్కో సిలిండర్ ధరపై రూ.220 నుంచి రూ.1,124 వరకు పెరిగిపోయింది. ఇటీవలే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి ఎల్ పీజీ ధరలు పెరుగుతున్నాయి. ఇక పెట్రోల్ ధరలు టాప్ మెట్రో నగరాల్లో లీటర్ కు 16.17 పైసలు చొప్పున తగ్గాయి. మరోవైపు డీజిల్ ధరలు లీటర్ కు 20-22 పైసల చొప్పున తగ్గాయి. ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ 5నెలల్లో కనిష్ట ధర రూ.71.49గా నమోదైంది. డీజిల్ ధర లీటర్ పై ఏడు నెలల కనిష్ట ధర రూ.64.87గా నమోదైంది. ఇప్పుడు ఆయిల్ ధరలు అమెరికా డాలర్, రూపాయి విలువపై ఆధారపడి ఉన్నాయి.

కానీ, ప్రపంచ స్థాయి చమురు ధరలు క్షీణించనప్పటికీ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. సగటు ప్రపంచ బెంచ్ మార్క్ ఎల్ పీజీ రేటులో హెచ్చుతగ్గుదలపై ఆధారంగా ప్రతినెలలో LPGపై పన్ను మారుతోంది. అంతర్జాతీయ ధరలు పెరిగిన ప్రతిసారి నాన్ సబ్సిడీ ఎల్ పీజీపై కనీస ధర ఆధారంగా కాకుండా జీఎస్టీ పెరిగిపోతోంది. కానీ, మార్కెట్ ధర మాత్రం మారుతోంది. ఎల్ పీజీ సబ్సిడీపై ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసింది.

డొమెస్టిక్ యూజర్లకు ప్రభుత్వం సబ్సిడీ కింద చెల్లించే ఒక్కో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.153.86 నుంచి రూ.291.48కు పెరిగింది. ప్రధాన్ మంత్రి ఉజ్వలా యోజన (PMUY) లబ్దిదారులకు ఈ సబ్బిడీ వర్తిస్తుంది. ఒక్కో సిలిండర్‌పై రూ.174.86 నుంచి సబ్సిడీ ధర రూ.312.48 వరకు పెరిగింది. ఆ సబ్సిడీ ధర నేరుగా ఎల్పీజీ యూజర్ల బ్యాంకు అకౌంట్లోలోనే ప్రభుత్వం చెల్లిస్తోంది.

దీంతో డొమిస్టిక్ యూజర్లకు ఒక్కో సిలిండర్ ధర రూ.567.02 ఉంటే.. PMUY యూజర్లకు రూ.546.02గా ఉంది. ప్రభుత్వం సబ్బిడీ లబ్దిదారులకు ఒక్కో కుటుంబంలో ఏడాదికి 12 సిలిండర్లు చొప్పున నేరుగా సబ్సిడీ అందిస్తోంది. కానీ, నాన్ సబ్సిడీ కేటగిరీలో ఎలాంటి సబ్సిడీ లేదు. నాన్ సబ్సిడీ సిలిండర్లు కొనుగోలు చేసే వారంతా మార్కెట్ ధరతో పాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.