ఔట్ గోయింగ్ కాల్స్‌పై Ring Time ఫైట్ : TRAIకు టెలికం కంపెనీల పంచాయితీ 

  • Published By: sreehari ,Published On : September 27, 2019 / 10:14 AM IST
ఔట్ గోయింగ్ కాల్స్‌పై Ring Time ఫైట్ : TRAIకు టెలికం కంపెనీల పంచాయితీ 

ప్రముఖ టెలికం నెట్ వర్క్ కంపెనీల్లో రింగ్ టైమ్ వివాదం ట్రాయ్ చెంతకు చేరింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇండియా రింగ్ టైమ్ విషయంలో పోట్లాడుకుంటున్నాయి. రింగ్ టైమ్ సమయాన్ని పెంచే విషయంలో తమ వాదనను ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లిన టెలికం దిగ్గజాలు ఈ మేరకు ఒక లేఖ రాశాయి.

ఇటీవల ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తమ నెట్ వర్క్ లో ఔట్ గోయింగ్ కాల్స్ రింగ్ టైమ్ సమయాన్ని 20 నుంచి 25 సెకన్లకు పెంచింది. ఈ 5-సెకన్ల సమయం పొడిగింపుపై ఇతర పోటీదారు టెలికం కంపెనీలు భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ రెండు టెలికోలు.. కనీస ప్రమాణాలు తగినట్టుగా 30-సెకన్ల రింగ్ సమయం ఉండాలని డిమాండ్ చేశాయి.

ఇంటర్ కనెక్షన్ యూజ్ ఛార్జ్ (IUC) రూల్ మార్చటానికి జియో రింగ్ సమయాన్ని తగ్గించిందని ట్రాయ్ కు రాసిన లేఖలో ఎయిర్ టెల్ ఆరోపించింది. తక్కువ సమయం రింగ్ అంటే ఎక్కువ మిస్డ్ కాల్స్ అని టెలికాం ఆరోపించింది. దీనివల్ల జియో నెట్‌వర్క్‌కు ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తాయి. IUC చెల్లింపులను ప్రస్తుత టెలికంపెనీలకు తగ్గించటానికి అనుమతిస్తుందని తెలిపింది.

15-20 సెకన్ల సమయం అనేది ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ప్రమాణమని జియో ఈ ఆరోపణను తోసిపుచ్చింది. ఈ వివాదంపై సెప్టెంబర్ 6న జరిగిన TRAI సమావేశంలో ఎయిర్‌టెల్, వోడా ఐడియా, BSNL, MTNLలు ఎక్కువ మొత్తంలో కాల్స్ కు సమాధానం ఇవ్వడానికి కనీసం 30 సెకన్ల రింగ్ వ్యవధిని ఆమోదించాయి. ఇది వినియోగదారుల ఆసక్తి నెట్‌వర్క్ పనితీరును మెరుగుపరుస్తుందని అభిప్రాయపడ్డాయి. 

మరోవైపు జియో.. రింగ్ సమయాన్ని 25 సెకన్లలో సెట్ చేయాలని కోరింది. కాల్ వచ్చిన వ్యక్తి స్పందించడానికి 20 సెకన్లు సమయం సరిపోతుందని పేర్కొంది. సమావేశంలో చర్చ అనంతరం.. కాల్ డిస్‌కనెక్ట్ కావడానికి ముందే ఫోన్ రింగ్ వ్యవధిపై టెలికం కంపెనీల అభిప్రాయాలను TRAI స్వాగతించింది. ఈ మేరకు కంపెనీల నుంచి సలహాలను కోరింది. కన్సల్టేషన్ పేపర్ ముగిసేలోపు ఈ అంశంపై ఏకాభిప్రాయానికి రావాలని ట్రాయ్ టెలికాం కంపెనీలను కోరినట్లు నివేదిక పేర్కొంది.