చికెన్ తింటే కరోనా వస్తుందా ? నిరూపించండి..రూ. కోటి ఇస్తాం

  • Published By: madhu ,Published On : March 18, 2020 / 05:12 AM IST
చికెన్ తింటే కరోనా వస్తుందా ? నిరూపించండి..రూ. కోటి ఇస్తాం

చికెన్ తింటే కరోనా వస్తుందనే ప్రచారంతో కోళ్ల అమ్మకాలు అమాంతం పడిపోయాయి. ధరలు ఢమాల్ అనడంతో పౌల్ట్రీ వ్యాపారులు లబోదిబో మొత్తుకుంటున్నారు. అరే చికెన్ తింటే కరోనా రాదు..ఏమీ రాదు..అంటూ ప్రచారం చేసినా..జనాలు మాత్రం కన్వీన్స్ కాలేకపోతున్నారు. చికెన్ వద్దు..ఏమొద్దు అంటున్నారు. పలువురు వ్యాపారులు కోళ్లను, చికెన్ ఫ్రీగా ఇస్తామని చెబుతున్నా..ఎవరూ ముందుకు రావడం లేదు.

దీంతో ఈ రంగానికి చెందిన వారికి చిర్రెత్తుకొచ్చింది. కోడి గుడ్డు..చికెన్ తింటే..కరోనా వస్తుంది అంటున్నారు..కదా…నిరూపించండి చూద్దాం..ఒక వేళ నిరూపిస్తే..రూ. కోటి ఇస్తా అంటూ ప్రకటించారు. మాంసం, కోళ్లు, కోడిగుడ్లకు తమిళనాడులోని నామక్కల్ జిల్లా పేరు గడించింది. అయితే..ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల..కోళ్ల ఫారాలు తీవ్ర నష్టాన్ని చవి చూస్తున్నాయి. ఈ స్థితిలో 2020, మార్చి 17వ తేదీ మంగళవారం గుడ్ల కోళ్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంా..సమ్మేళ్ల అధ్యక్షుడు ముత్తు స్వామి, ఉపాధ్యక్షులు వాగ్లీ సుబ్రమణ్యంలు మీడియాతో మాట్లాడారు.

కొన్ని రోజులుగా కరోనా భీతితో కోడి మాంసం, కోడి గుడ్ల వ్యాపారం తీవ్ర నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 4.50గా విక్రయించే కోడి గుడ్డు రూ. 1.30, కోడి మాంసం రూ. 80 నుంచి రూ. 20కి తగ్గిందన్నారు. దీనికి కారణం సోషల్ మీడియాలో తప్పుడు వదంతులేనని స్పష్టం చేశారు. కోళ్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని ఎవరైనా నిర్ధారిస్తే..వారికి తమ సమ్మేళం తరపున రూ. కోటి బహుమతి అందచేస్తామని వారు ప్రకటించారు. కోళ్లను నాశనం చేసే ఆలోచన తమకు లేదని, ప్రజలు వదంతులు నమ్మకుండా..కోడి మాసం, కోడి గుడ్లను తినాలని వారు కోరుతున్నారు. 

Read More : ముందుకు వెళ్లలేక..వెనక్కి రాలేక : కౌలాలంపూర్‌లో తెలుగు విద్యార్థులు విలవిల