హాంకాంగ్ ఫైనాన్స్ రంగ నిపుణులను ముంబై ఆకర్షిస్తుందా?

  • Published By: sreehari ,Published On : July 4, 2020 / 05:06 PM IST
హాంకాంగ్ ఫైనాన్స్ రంగ నిపుణులను ముంబై ఆకర్షిస్తుందా?

ముంబైని ఫైనాన్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు గతంలో కూడా వచ్చాయి. కానీ , అందుకు ఫైనాన్స్ రంగంలో సంస్కరణలు అవసరం అయ్యాయి. అందుకు ప్రభుత్వం సిద్ధం కాలేదు. అందుకే ఆ ప్రయత్నాలు అక్కడితో ఆగిపోయాయి. ఇప్పుడు హాంకాంగ్ నుంచి ఫైనాన్స్ రంగ నిపుణులను ముంబై ఆకర్షిస్తుందా? అందుకు ముంబై సిద్ధంగా ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.వాస్తవానికి ఆసియాలో ముంబైని ఫైనాన్సియల్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రయత్నాలు గతంలోనే జరిగాయి. పెర్సీ మిస్త్రీ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ 2007లో దీనిపై తన రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందజేసింది. గ్లోబల్ ఫైనాన్సియల్ హబ్‌గా ఎదగడానికి అవసరమైన నిపుణులు ముంబైలో ఉన్నారు. కానీ, అందుకు అవసరమైన మౌలిక వసతులు మాత్రం ముంబై‌లో లేవు.

ముంబై గ్లోబల్ ఫైనాన్సియల్ హబ్‌గా ఎదగాలంటే ముందు ఫైనాన్స్ రంగం‌లో సంస్కరణలు అమలు చేయాలని ఆ రిపోర్ట్ సిఫార్సు చేసింది. లండన్ లేదా న్యూయార్క్ తరహాలో వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. అమలు చేస్తే రిజర్వు బ్యాంకు స్థాయి తగ్గించాల్సి ఉంటుంది. అంతే కాదు అత్యధిక బ్యాంకులు ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. కానీ అవన్నీ అప్పుడు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం కాలేదు. దాంతో గ్లోబల్ ఫైనాన్సియల్ హబ్‌గా ముంబైని తీర్చిదిద్దాలన్న అప్పటి కల చెదిరింది. అప్పటికీ ఇప్పటికీ ముంబై పెద్దగా మారలేదు. కాకపోతే టెలీకమ్యూనికేషన్ల వ్యవస్థ, డేటా సముపార్జన మెరుగయ్యింది. హాంకాంగ్‌కు ముంబైకి కొన్ని పోలికలున్నాయి. కొన్ని తేడాలున్నాయి.

ముంబై కన్నా హాంకాంగ్ జనాభా అధికమన్నారు. ముంబైకన్నా హాంకాంగ్‌లో యువకుల సంఖ్య అధికంగా ఉంటుంది. హాంకాంగ్‌లో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉంది. హాంకాంగ్‌లో గృహ వసతి చౌక. ముంబైలో అది అత్యధికంగా ఉంది. హాంకాంగ్‌లో జీవన వ్యయం తక్కువ. ముంబైలో జీవన వ్యయం ఎక్కువ. ముంబైకాన్నా హాంకాంగ్‌లో ఉష్ణోగ్రతలు అధికం. హాంకాంగ్‌లో తక్కువ ఖర్చుతో ప్రజా రవాణా వ్యవస్థ ఉంది. ముంబైలో రవాణా ఖర్చు ఎక్కువ. పోలికలూ, తేడాలు పక్కన పెడదాం.

అప్పటికీ, ఇప్పటికీ మార్పుల సంగతి కూడా ప్రస్తుతానికి పక్కన పెడితే… హాంకాంగ్ ఎదుర్కుంటున్న పరిస్థితి దృష్ట్యా ముంబై మెరుగైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. చట్ట బద్దమైన పాలన, స్వేచ్ఛగా అభిప్రాయాల వ్యక్తీకరణకు అవకాశమంటున్నారు. ఇప్పుడు హాంకాంగ్ ఫైనాన్స్ రంగం కోల్పోతోంది. ముంబైలో పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెడితే సరిపోతుంది. మౌలిక వసతులు మెరుగుపడితే ముంబైని మించిన నగరం లేదనే వాదన వినిపిస్తోంది.

Read:వర్క్ ఫ్రమ్ హోమ్ తో వచ్చే ఆరోగ్య సమస్యలు మీకు తెలుసా..?