Wings India 2022: నేటితో ముగియనున్న “వింగ్స్ ఇండియా 2022”: సందర్శకులకు అనుమతి

వింగ్స్ ఇండియా ఏవియేషన్ షోను తిలకించేందుకు శనివారం పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. శని ఆదివారాల్లో సాధారణ ప్రజల సందర్శనానికి అనుమతి ఇచ్చారు.

Wings India 2022: నేటితో ముగియనున్న “వింగ్స్ ఇండియా 2022”: సందర్శకులకు అనుమతి

Wings India

Wings India 2022: దేశంలో విమానయాన రంగాన్ని ప్రోత్సహిస్తూ..అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాలపై అవగాహనా కల్పించేలా కేంద్ర పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వింగ్స్ ఇండియా 2022 ఏవియేషన్ ప్రదర్శన ఆదివారంతో ముగియనుంది. గురువారం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన విమానయాన సంస్థలు పాల్గొన్నాయి. విమాన తయారీ, సేవలు వంటి పలు అంశాలపై వ్యాపార వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఆయా సంస్థలు. గురువారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో మొదటి రెండు రోజులు వ్యాపారాభివృధి అవకాశాల కోసం జాతీయ అంతర్జాతీయ వ్యాపారస్తులకు అనుమతి ఇచ్చారు. ఇక శని ఆదివారాల్లో సాధారణ ప్రజల సందర్శనానికి అనుమతి ఇచ్చారు. వారాంతం కావడంతో ఎయిర్ షోను తిలకించేందుకు నగర వాసులు ఉత్సాహం కనబరిచారు.

Also Read:Electric Two Wheeler: పేలుతున్న విద్యుత్ స్కూటర్లు: ఎండాకాలం వాహనదారులు జాగ్రత్త

వింగ్స్ ఇండియా ఏవియేషన్ షోను తిలకించేందుకు శనివారం పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. వివిధ సంస్థలకు చెందిన విమానాలు హెలికాఫ్టర్లు సహా A350 ఎయిర్ బస్, HAL హెలికాప్టర్, వంటి విహంగాలను చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. వింగ్స్ ఇండియా 2022 ఏవియేషన్ షో ఆదివారంతో ముగుస్తుంది. నేటి సాయంత్రం 6 గంటలకు వింగ్స్ ఇండియా 2022 ప్రదర్సన ముగియనుంది. రూ. 590 టికెట్ తో సాధారణ ప్రజల సందర్శనార్థం అనుమతి ఇస్తున్నారు నిర్వాహకులు. ప్రదర్శన చూసేందుకు నగర వాసులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సందర్శకులకు చక్కని అనుభూతి పంచేలా 12 గం. 4 గం.లకు రెండు సార్లు హెలికాప్టర్ విన్యాసాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Also Read:Political Speeches: చిరునవ్వు ప్రసంగాలు నేరంగా పరిగణించలేం: ఢిల్లీ హైకోర్ట్