షియోమీదే పేటెంట్ : 5 కెమెరాల ఫోల్డబుల్ ఫోన్ ఇదిగో

  • Published By: sreehari ,Published On : November 11, 2019 / 12:54 PM IST
షియోమీదే పేటెంట్ : 5 కెమెరాల ఫోల్డబుల్ ఫోన్ ఇదిగో

ఇప్పడుంతా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లదే ట్రెండ్. అద్భుతమైన ఫీచర్లతో పాటు స్మార్ట్ ఫోన్ డిజైన్ పై కూడా మొబైల్ కంపెనీలు ప్రత్యేక దృష్టిపెడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకునేందుకు అత్యాధునిక డిజైన్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ఇప్పటికే కొన్ని దిగ్గజ స్మార్ట్ ఫోన్ మేకర్లు ఫోల్డబుల్ డివైజ్ లను రూపొందించాయి. అదే బాటలో చైనీస్ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ కూడా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను రూపొందిస్తోంది. 

తాజాగా 5 కెమెరాల సెటప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ పేటెంట్ దక్కించుకుంది. షియోమీ.. యూజర్ వినియోగానికి తగినట్టుగా ఫోల్డబుల్ ఫోన్లను బయటకు ఫోల్డింగ్ స్ర్కీన్ అయ్యేలా డిజైన్ చేసింది. యూజర్ ఎలా వాడితే అలా.. ఐదు కెమెరాలు రియర్ కెమెరాలుగా లేదా ఫ్రంట్ కెమెరాలుగా మారిపోతాయని ఓ పోర్టల్ రిపోర్టు తెలిపింది. డివైజ్ లోని స్కెచెస్ చూస్తే.. థిన్ బెజిల్స్, నో డిస్ ప్లే నాచ్ ఉంది. 

దీనికి సంబంధించి పేటెంట్ కోసం షియోమీ ఆగస్టు 20న దరఖాస్తు చేయగా గతవారమే ఆమోదం లభించింది. ఫోల్డబుల్ ఫోన్ ఓపెన్ చేసిన సమయంలో ఎడమ పక్కన పాప్-అప్ సిట్ కనిపిస్తోంది. గతవారమే షియోమీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 5 రియర్ కెమెరాలతో Mi CC9 ప్రోను చైనాలో లాంచ్ చేసింది.

ఈ ఫోన్ లో 108MP భారీ ప్రైమరీ సెన్సార్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ ఫీచర్లలో 6.47 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ (1080×2340ఫిక్సల్స్) OLED డిస్ ప్లేతో వచ్చింది. ఈ డివైజ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్ ఉండగా, 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది.