Xiaomi MI క్రెడిట్ లోన్లు : రూ.లక్ష రుణం..  రూ.2 వడ్డీ

  • Published By: sreehari ,Published On : August 26, 2019 / 08:24 AM IST
Xiaomi MI క్రెడిట్ లోన్లు : రూ.లక్ష రుణం..  రూ.2 వడ్డీ

చైనా అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ ఇండియాలో లెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతోంది. ఇప్పటివరకూ దేశంలో స్మార్ట్ ఫోన్లతో ఆకట్టుకున్న షియోమీ కంపెనీ తమ వినియోగదారులకు లోన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. పదివేలు కాదు.. యాభైవేలు కాదు.. ఏకంగా రూ. లక్ష (1,400 యూఎస్ డాలర్లు) వరకు లోన్లు ఇవ్వనుంది. అది కూడా (1.8 శాతం) రూ.2 లోపు వడ్డీకే అందించనుంది. చైనీస్ కంపెనీ ఎలిజిబుల్ కస్టమర్లకు ఈజీగా లోన్లు అందించేందుకు తమ ఫైనాన్షియల్ సర్వీసులను ప్రారంభించనున్నట్టు ఓ నివేదిక తెలిపింది. షియోమీ Mi Credit Service పేరుతో ఎంఐ వినియోగదారులకు ఆఫర్ చేయనుంది. మరో కొన్ని వారాల్లో ఇండియాలో మైండ్ బ్లోయింగ్ లోన్లు ఆఫర్ చేయనుంది. 

ఇప్పటికే Mi Credit సర్వీసును కంపెనీ ‘beta Phase’ కింద రన్ చేస్తోంది. చైనా బయట ఇండియాలో షియోమీ రెండో అతిపెద్ద మార్కెట్ ఉంది. టాప్ టెక్ దిగ్గజాలైన గూగుల్ కూడా ఇప్పటికే గూగుల్ పే సర్వీసుతో ఇండియాలో రన్ అవుతోంది. షియోమీ కూడా ప్రపంచంలో నాల్గో అతిపెద్ద మొబైల్ మార్కెట్ కంపెనీ. చైనాలో షియోమీకి 2018 మధ్య ఏడాదికి 8 బిలియన్ డాలర్ల లోన్లలో 2 బిలియన్ డాలర్లు ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టు ఓ రిపోర్టు తెలిపింది. Mi credit సర్వీసు పేరుతో ఇప్పటికే చైనాలో షియోమీ మైక్రో లెండింగ్ ప్రొడక్టును ఆఫర్ చేస్తోంది. 

2018 ఏడాది మే నెలలో ఇండియాలో Mi credit సర్వీసును లెండెంగ్ ప్లాట్ ఫాం క్రేజీబీ భాగస్వామ్యంతో లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ బిజినెస్ లో షియోమీకి మంచి క్రేజ్ ఉంది. ఇండియాలో 2018లో రిలీజ్ అయిన కంపెనీ బ్రాండ్ రియల్ మికి భారీ గిరాకీ ఉంది. ఈ రెండెంటీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. 

యూజర్ ప్రైవసీ డేటా భద్రమేనా? :
షియోమీ తమ ఫోన్ యాక్టివిటీ డేటాను యూజర్ల క్రెడిట్ ప్రొఫైల్ క్రియేట్ చేసేందుకు వాడుతుంది. mi creidt సర్వీసు ద్వారా లోన్ పొందాలంటే ముందుగా కంపెనీకి లోన్ అప్లయ్ చేసేవారి పర్సనల్ డేటాను యాక్సస్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్, ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్ డేటాకు సంబంధించి మొత్తాన్ని యాక్సస్ చేస్తుంది. దీని ఆధారంగా లోన్ ఆఫర్ చేసే ముందు యూజర్ కు లోన్ అప్రూవ్ చేయాలా లేదా అని డిసైడ్ చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో డేటా ప్రైవసీ ఇష్యూ ప్రమాదకరంగా మారింది. లోన్ల కోసం ఆశ పడి వ్యక్తిగత డేటా వివరాలను బహిర్గతం చేయడం ద్వారా యూజర్ల ప్రైవసీ ఎంతవరకు భద్రంగా ఉంటుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.