ఆ రైల్వే స్టేషన్ రోజు ఆదాయం రూ. 20

  • Published By: chvmurthy ,Published On : January 18, 2020 / 10:33 AM IST
ఆ రైల్వే స్టేషన్ రోజు ఆదాయం రూ. 20

ఊళ్లో ఒక రైల్వే స్టేషన్ నిర్మించారంటే ఆ ఊరిలో జనం  రోజూ రైలెక్కి పక్క ఊరికి వెళ్ళటమో…ఇంకెక్కడికైనా ప్రయాణం చేయటమో  జరుగుతుంది. ఆ ఉరి ప్రజల అవసరాల కోసం ఇతర ఊళ్ళకు వెళ్లే వాళ్ల సంఖ్య బాగానే ఉండి ఉంటుంది.  సో …ఆ లైనులో ఒకటో రెండో ప్యాసింజర్ రైళ్లు అక్కడ ఆగుతాయి.  ప్రయాణికులను  గమ్యస్ధానాలకు చేరుస్తాయి.  

bichupalli railway station 3
రైల్వే శాఖలో అత్యంత చిన్న రైల్వే స్టేషన్ లో దాని నిర్వహణకు అయ్యే ఖర్చులు, సిబ్బంది జీత భత్యాలు చూసుకున్నా కనీసం నెలకు 3లక్షల రూపాయలైనా అవుతుంది. వాణిజ్యపరంగాఆలోచిస్తే  అంతకంటే రెట్టింపు ఆదాయం ఆ రైల్వే స్టేషన్ వల్ల  రావాలి.  కాగా కేంద్ర ప్రభుత్వం  రైల్వేశాఖ  ఎంత ఆదాయం గడిస్తోందో అందరికీ తెలిసిన విషయమే…. రైల్వే బడ్జెట్ లో సదరు మంత్రిగారు వివరిస్తారు.  

bichupalli rly station 2
కానీ… ఒడిషాలోని ఓ రైల్వే స్టేషన్ రోజు వారి ఆదాయం ఎంతో తెలిస్తే మీరు నోరెళ్లెబెడతారు. అదెక్కడ అంటారా…….ఒడిశాలోని బొలంగిర్‌ జిల్లాలో బిచ్చుపాలి రైల్వేస్టేషన్‌కు వస్తున్న ఆదాయం రోజుకు అక్షరాలా రూ.20 మాత్రమే. ఇద్దరంటే ఇద్దరే  ప్రయాణికులు ఆ రైల్వే స్టేషన్ నుంచి  రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. బొలాంగిర్‌-బిచ్చుపాలి మధ్య 16.8కిలోమీటర్ల మేర దాదాపు రూ.115కోట్లు ఖర్చు పెట్టి ఈ రైల్వేలైన్‌ నిర్మించారు. గతేడాది జనవరి 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైల్వే స్టేషన్‌ ప్రారంభించారు.

Bichupally rly station 4

ఎప్పుడు చూసినా రైల్వే స్టేషన్‌ ఖాళీగా కనిపిస్తుండటంతో అసలు ఈ రైల్వేస్టేషన్‌ ఆదాయమెంత అంటూ బొలాంగిర్‌కు చెందిన  ఆర్టీఐ కార్యకర్త హేమంత పాండ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం తెలుసుకుని బయట పెట్టారు. దీనికి సంబల్‌పూర్‌ డివిజన్‌ అధికారులు ఇచ్చిన సమాధానంతో  అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. సోనేపూర్‌ రైల్వేలైన్‌కు దీన్ని కనెక్ట్‌ చేస్తే ఈ స్టేషన్‌ ఆదాయం పెరుగుతుందని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే చీఫ్‌, పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి జేపీ మిశ్రా తెలిపారు.