నో క్లూ…YES బ్యాంక్ సంక్షోభంపై ఫౌండర్ రాణా కపూర్ ఆశక్తికర వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 6, 2020 / 03:12 PM IST
నో క్లూ…YES బ్యాంక్ సంక్షోభంపై ఫౌండర్ రాణా కపూర్ ఆశక్తికర వ్యాఖ్యలు

యస్ బ్యాంక్ సంక్షోభంపై ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ రాణా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యస్ బ్యాంకుపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మారటోరియం విధించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి తనకు అసలు తెలియదని అన్నారు. గడచిన 13 నెలల నుంచి బ్యాంకుతో ఏ విధంగానూ తనకు సంబంధం లేదని, అందువల్ల నాకు ఎలాంటి అవగాహన లేదు అని ఆయన అన్నారు.

ఒకప్పుడు యస్ బ్యాంక్ డ్రైవింగ్ ఫోర్స్ గా వ్యవహరించిన రాణా కపూర్…యస్ బ్యాంకులో తన చివరి స్టేక్‌ను 2019 నవంబర్ లో అమ్మేశారు. అదే సమయంలో ప్రమోటర్లు యస్ కేపిటల్, మోర్గాన్ క్రెడిట్స్ కూడా తమ తమ వాటాలను అమ్మేశాయి. ఆయన, ఆయన గ్రూప్ సంస్థలు అంతకుముందు యస్ బ్యాంక్‌లోని రూ.510 కోట్ల విలువైన 2.16 శాతం వాటాలను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా అమ్మేశాయి. అదే నెలలో అమ్మేసిన 1.8 శాతం వాటాలకు ఇది అదనం.

రాణా కపూర్ యస్ బ్యాంక్‌ను రూ.3.4 లక్షల కోట్ల బుక్ వాల్యూకు ఒక దశాబ్దంలోనే అభివృద్ధి చేశారు. అయితే బ్యాంకు రుణాలు విపరీతంగా పెరగడంతో నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయి. బ్యాంకు ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఆర్బీఐ గురువారం కఠిన చర్యలు తీసుకుంది. ఈ బ్యాంకు బోర్డును సస్పెండ్ చేసింది. ఈ బ్యాంకు రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్‌ను శుక్రవారం ప్రకటించింది.

యస్ బ్యాంక్ ఖాతాదారులు నెలకు రూ50వేలు మాత్రులు విత్ డ్రా చేసుకునేలా గురువారం ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్-3,2020వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది. యస్ బ్యాంకు ట్రబుల్ మొదట…దాని ఎన్‌పిఎ(nonperforming asset)లు  పెరిగినప్పుడు మొదలైంది. బ్యాంక్ తీవ్రమైన పాలన సమస్యలను కూడా ఎదుర్కొంది, ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ లో స్థిరమైన క్షీణతకు దారితీసింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం మాట్లాడుతూ యస్ బ్యాంక్ డిపాజిటర్లకు భరోసా ఇచ్చారు. ఈ బ్యాంకు ఉద్యోగులకు ఒక ఏడాది వరకు జీతాలకు అభయం ఇచ్చారు. ఎస్ బ్యాంక్ ఖాతాదారుల డబ్బు సురక్షితంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఎస్ బ్యాంక్ విషయంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్ తో మాట్లాడినట్లు నిర్మలా తెలిపారు. దీనిపై సత్వర పరిష్కారం కనుగొనే దిశగా ఆర్బీఐ కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం,ఆర్బీఐ ఈ విషయంలో కలిసి పనిచేస్తాయన్నారు. బ్యాంక్, ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొనే చర్యలు తీసుకుంటామని నిర్మలా తెలిపారు