SBI ఖాతాలోకి YES BANK!

  • Published By: madhu ,Published On : March 6, 2020 / 02:33 AM IST
SBI ఖాతాలోకి YES BANK!

కష్టాల్లో ఉన్న YES BANKను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ బ్యాంకులో ఉన్న వాటాను కొనుగోలు చేయడానికి SBI, ఇతర ఆర్థిక సంస్థలు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 2020, మార్చి 05వ తేదీ గురువారం దీనికి సంబంధించిన వార్తలు వినపడుతుండడంతో మార్కెట్‌‌లో యెస్ బ్యాంకుకు సంబంధించిన షేర్లు 25 శాతానికి పైగా లాభాలను పొందాయి. గురువారం రాత్రి యెస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంకు మారటోరియం విధించింది. 

ఇదిలా ఉంటే…నగదు విత్ డ్రా చేయాలంటే..పరిమితిని విధించింది. నెలకు రూ. 50వేలుగా నిర్ణయించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ – 1949 సెక్షన్ 45 కింద యెస్ బ్యాంకుపై మారటోరియం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం తప్ప..ప్రత్యామ్నాయం కనిపించడం లేదని RBI ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్యాంకుకు సంబంధించిన ప్రతినిధులు..పెట్టుబడి దారులతో చర్చలు జరిపినా సక్సెస్ కాలేదని తెలిపింది. ఎస్‌బీఐ, ఇతర ఆర్థిక సంస్థలు యెస్ బ్యాంకులో వాటాను కొంటున్నాయని, బెయిల్ అవుట్ ప్రకటిస్తాయని వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆర్‌బీఐ ఈ చర్యలు చేపట్టడం విశేషం.

2004లో గ్లోబల్ ట్రస్టు బ్యాంకును OBC, 2006లో యునెైటెడ్ వెస్ట్రన్ బ్యాంకును IDBI బ్యాంకు టేకోవర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక..యెస్ బ్యాంకులో వాటాను కొనుగోలు చేయాలంటే..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్‌లో సవరణలు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో…ఈ సవరణలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని సమాచారం.

కానీ…RBI, లేదా ప్రభుత్వం..నియంత్రణ సంస్థలు లేదా SBI నుంచి ఎలాంటి సమాచారం అందలేని YES BANK స్పష్టం చేసింది. ఎవైనా పరిణామాలుంటు…ఎక్స్చైంజ్‌లకు చెబుతామని యెస్ బ్యాంకు వెల్లడించింది. 

Read More :రేవంత్ భవిష్యత్‌పై నీలి నీడలు