ఇదిగో ప్రాసెస్: Chromebookలో MS Word వాడొచ్చు!

  • Published By: sreehari ,Published On : December 31, 2019 / 08:21 AM IST
ఇదిగో ప్రాసెస్: Chromebookలో MS Word వాడొచ్చు!

Chromebook వాడుతున్నారా? మీ క్రోమ్ బుక్‌లో మైక్రోసాఫ్ట్ వర్డ్ కూడా పనిచేస్తుంది. గూగుల్ డాక్స్ (Google Docs)కు రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతుండటంతో MS Word వాడేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అందులోనూ క్రోమ్ బుక్ యూజర్లంతా గూగుల్ డాక్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు.

MS Word కూడా క్రోమ్ బుక్‌లో పనిచేస్తుంది. ఇప్పటికే Chromebook ప్రధాన ఫీచర్లలో ఒకటైన Google Docsను మీ డివైజ్ లోకి నేరుగా ఓపెన్ అయ్యేలా ఇంటిగ్రేటింగ్ చేస్తోంది. అంటే.. దీని అర్థం.. మీ డివైజ్‌లో మైక్రోసాఫ్ట్ Word డౌన్‌లోడ్ చేసుకోవడమే కాదు..Install కూడా చేసుకోవచ్చు. ఇంతకీ, Chromebookలో మైక్రోసాఫ్ట్ ఎలా వర్క్ అవుతుందో ఓసారి చూద్దాం. 

వాస్తవానికి క్రోమ్‌బుక్.. Google Docsను MicroSoft Word వినియోగానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చింది. కానీ, సాంప్రదాయక వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్ వేర్ ఇక పనిచేయదని కాదు. దీని అర్థం.. క్రోమ్‌బుక్‌లో ఇంకా MicroSoft Word సపోర్ట్ చేస్తుంది. ChromeBookలో MS Word కావాలంటే ముందుగా Google Play store నుంచి ‘Word’ లేదా ‘MicroSoft Word’ అని Search చేసి Download చేసుకోండి.

ఆన్‌లైన్‌లో కూడా Play Store యాక్సస్ చేసుకోవచ్చు. ఈ App ఒకసారి ఇన్ స్టాల్ చేశాక స్ర్కీన్ పై కనిపించే ఆప్షన్ ఒక్కొక్కటిగా ఫాలో అవ్వండి. ఆ తర్వాత మీ MS ఆఫీసు అకౌంట్లోకి Login అవ్వండి. ఒకవేళ మీరు వాడే Chrome Bookలో Chrome Web Store వాడుతున్నట్టయితే అసలైన Appకు బదులుగా Microsoft Office Online వాడుకోవచ్చు. మీ Email, Password ఎంటర్ చేసి MS ఆఫీసు అకౌంట్లో login అవ్వండి. 

1. Microsoft Word డౌన్‌లోడ్ ఇలా :
* మీ Chromebookలో Google Play Store ఓపెన్ చేయండి.
* Top Search Bar లో Word లేదా Micro Soft Word ఎంటర్ చేసి Click చేయండి.
* మీరు Search చేసినప్పుడు MicroSoft Word అని తప్పక కనిపించాలి. 
* ఇప్పుడు.. Green కలర్ లో కనిపించే Install బటన్ పై Click చేయండి.
* అది వెంటనే ఆటోమాటిక్ గా Download ప్రాసెస్ మొదలవుతుంది. 
* డౌన్ లోడ్ పూర్తయ్యాక Cancel బటన్ మాదిరిగా మారిపోతుంది.
* మీ యాప్ రెడీ.. ఇక Open బటన్ పై క్లిక్ చేయండి.
* Launcher నుంచి కూడా MicroSoft Word యాక్సస్ చేసుకోవచ్చు.

2. Login ప్రాసెస్ ఇలా :
* MicroSoft Wordలో Login కాగానే మీకో Pop-up మెసేజ్ కనిపిస్తుంది.
* Allow బటన్ పై Click చేయగానే మీ ఫొటోలు, మీడియా, ఫైల్స్ యాక్సస్ అవుతుంది. 
* మీ Email, ఫోన్ నెంబర్ లేదా Skype nameతో మీ అకౌంట్లకి Sign in అవ్వొచ్చు.
* Blue Arrow బటన్ పై Click చేసిన వెంటనే Continue కోసం Enter నొక్కండి.
* తర్వాతి పేజీలో మీ Password ఎంటర్ చేయండి. 
* మీరు యూనివర్శిటీ అకౌంట్ లేదా బిజినెస్ అకౌంట్ ద్వారా Signing అవుతున్నారా?
* ఈ ప్రాసెస్‌లో మరిన్ని సెక్యూరిటీ Steps పూర్తి చేయాల్సి ఉంటుంది. 
* అకౌంట్లోకి Sign in కాగానే నేరుగా MS Word హోంపేజీ ఓపెన్ అవుతుంది.
* ఎడమవైపు భాగంలో మీ Recent Documents కనిపిస్తాయి.
* Open other Documents పై Click చేయండి.
* కిందిభాగంలో More లేదా Choose from అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
* ఏదైనా ఒక Templates నుంచి New Project ఓపెన్ చేయొచ్చు.