ఎక్కడ పడితే అక్కడ కుదరదు : ఫోన్ ఛార్జింగ్‌పై SBI వార్నింగ్ 

  • Published By: madhu ,Published On : December 14, 2019 / 11:53 AM IST
ఎక్కడ పడితే అక్కడ కుదరదు : ఫోన్ ఛార్జింగ్‌పై SBI వార్నింగ్ 

మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా ? మొబైల్ ఛార్జింగ్ స్టేషన్‌లలో ఛార్జింగ్ పెడుతున్నారా ? దీనిపై SBI వార్నింగ్ ఇష్యూ జారీ చేసింది. ఛార్జింగ్ పాయింట్ల వద్ద డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. ఛార్జింగ్ స్టేషన్‌ల వద్ద ఛార్జింగ్ పెట్టుకొనే విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలని, హ్యాకర్లు పాస్ వర్డ్‌లు దొంగిలించి..మొత్తం డేటాను తెలుసుకొనే ప్రమాదం ఉందని తెలిపింది.

వీరి బారి నుండి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం..సొంత ఛార్జింగ్ కేబుళ్లను తీసుకోవడం బెటర్ అని సూచించింది. లేకపోతే..ఎలక్ట్రికల్ అవుట్ లెట్ నుంచి నేరుగా ఛార్జ్ చేయడం, పవర్ బ్యాక్‌లను వెంట తీసుకెళ్లడం మంచిందని వెల్లడించింది. 

Read More : FASTag మస్ట్ : టోల్ తీస్తారు

డేటాను ఎలా కాపాడుకోవాలో చెబుతూ ఓ వీడియోను జత చేసింది. ఛార్జింగ్ పోర్టులోనే మాల్ వేర్‌ను ఇన్ స్టాల్ చేసి హ్యాకర్లు ఈ దాడికి పాల్పడుతుంటారని ఎస్‌బీఐ యాజమాన్యం వెల్లడించింది. మొబైల్‌లో కీలక సమాచారం మొత్తం దొంగిలిస్తారని వెల్లడించింది. సో..ఎస్‌బీఐ వినియోగదారులు జాగ్రత్తగా ఉండండి. 

Think twice before you plug in your phone at charging stations. Malware could find a way in and infect your phone, giving hackers a way to steal your passwords and export your data.#SBI #Malware #CyberAttack #CustomerAwareness #Cybercrime #SafeBanking #JuiceJacking pic.twitter.com/xzSMNNNv4U