కొత్త ఫీచర్: మీ WhatsApp అకౌంట్.. ఇక అన్ని డివైజ్‌లపై

  • Published By: sreehari ,Published On : February 10, 2020 / 12:45 AM IST
కొత్త ఫీచర్: మీ WhatsApp అకౌంట్.. ఇక అన్ని డివైజ్‌లపై

ఫేస్‌బుక్ సొంత మెసేంజర్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తీసుకోస్తోంది. ఇప్పటివరకూ ఒక వాట్సాప్ అకౌంట్ ను ఒక డివైజ్ పై మాత్రమే వాడేందుకు అనుమతి ఉంది. యూజర్ల సింగిల్ వాట్సాప్ అకౌంట్.. మల్టీపుల్ డివైజ్‌ల్లో అనుమతించేలా వాట్సాప్ కొత్త ఫీచర్ పై టెస్టింగ్ చేస్తోంది. వాట్సాప్ చాట్.. ఎండ్-టూ ఎండ్ ఎన్ క్రిప్ట్‌డ్ సెక్యూరిటీతో ఉండగా, ప్రత్యేకమైన డివైజ్ లకు అనుమతించేలా కొత్త మెథడ్ పై వర్క్ చేస్తున్నట్టు WABetaInfo రిపోర్టులో తెలిపింది.

ప్రస్తుతం.. వాట్సాప్ యూజర్లు ఒక అకౌంట్.. ఒక డివైజ్ పై మాత్రమే రిజిస్టర్ చేసుకునే వీలుంది. ఒకే వాట్సాప్ అకౌంట్.. మరో డివైజ్ లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తే.. ముందుగా పాత డివైజ్ నుంచి వాట్సాప్ అకౌంట్ లాగ్ ఔట్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ కొత్త ఫీచర్ ద్వారా సింగిల్ వాట్సాప్ అకౌంట్ ను ఒకేసారి అన్ని డివైజ్ ల్లో లాగిన్ కావొచ్చు. 

తమ ప్లాట్ ఫాంపై యూజర్లకు సౌకర్యవంతంగా ఉండేలా వాట్సాప్ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. iOS యూజర్ల కోసం వాట్సాప్ కొత్త Beta Updateపై టెస్టింగ్ చేస్తోంది. ఇందులో హైడ్ మ్యూటెడ్ స్టేటస్ అప్ డేట్, స్పాష్ స్క్రీన్, గ్రూపు ప్రైవసీ ఫీచర్, యాప్ బ్యాడ్జ్ సహా ఆకర్షణమైన ఫీచర్లను రిలీజ్ చేయనుంది.

ఇటీవలే వాట్సాప్.. తమ ప్లాట్ ఫాంపై కొత్త గ్రూపు ప్రైవసీ ఫీచర్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా.. కొత్త వాట్సాప్ యాప్ గ్రూపుకు యాడ్ చేసుకోవచ్చు.బ్లాక్ లిస్టులో ఉన్న వారిని ఏదైనా వాట్సాప్ గ్రూపులో యాడ్ చేయకుండా యూజర్లకు ఈ ఫంక్షన్ అనుమతి ఇస్తుంది.

అయినప్పటికీ బ్లాక్ లిస్టు యూజర్లు వ్యక్తిగత సందేశాలను గ్రూపు జాయినింగ్ రిక్వెస్టులను పంపుకోవచ్చు. ఈ ప్రైవసీ ఫీచర్.. మొదటిసారిగా ఆండ్రాయిడ్ డివైజ్ లపై వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత బీటా వెర్షన్ ను ఐఓఎస్ డివైజ్ ల్లోకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు.. కొత్త Splash స్ర్కీన్ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఐఫోన్లలో వాట్సాప్ లోగోను ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు.