ఈజీ ప్రాసెస్ ఇదిగో : SBI ఖాతాదారులా? మీ ఆధార్ లింక్ చేయండిలా

  • Published By: sreehari ,Published On : October 15, 2019 / 11:11 AM IST
ఈజీ ప్రాసెస్ ఇదిగో : SBI ఖాతాదారులా? మీ ఆధార్ లింక్ చేయండిలా

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతాదారులకు గమనిక. మీ ఎస్బీఐ అకౌంట్ ను మీ ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేసుకున్నారా? లేదంటే.. వెంటనే లింక్ చేసుకోండి. ఎస్బీఐ సేవింగ్ ఖాతా కలిగిన ప్రతి కస్టమర్ తమ ఆధార్ నెంబర్ తో లింక్ చేసుకోవడం తప్పనిసరి.

ATM నుంచి విత్ డ్రా చేయాలన్నా లేదా క్యాష్ డిపాజిట్ చేయాలన్నా, నగదు ఉపసంహరణ చేయాలంటే, పాస్ బుక్ అప్ డేట్ చేసుకోవాలన్నా సరే కస్టమర్లు కచ్చితంగా తమ ఆధార్ నెంబర్ ను బ్యాంకు అకౌంట్లతో లింక్ చేసుకోవాల్సిందే.

ఎస్బీఐ అకౌంట్లతో ఆధార్ లింక్ చేసుకునేందుకు బ్యాంకు తమ కస్టమర్లకు ఎన్నో మార్గాలను అందిస్తోంది. మీ సౌకర్యాన్ని బట్టి ఏదైనా ఒక మార్గాన్ని అనుసరించి బ్యాంకు అకౌంట్ ను ఆధార్ తో లింక్ చేసుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ తో ఆధార్ ఎలా లింక్ చేసుకోవాలో ఓసారి చూద్దాం.

SBI అధికారిక వెబ్ సైట్ : 
* www.sbi.co.in కార్పొరేట్ వెబ్ సైట్ విజిట్ చేయండి.
* Homepage బ్యానర్ పై Link you Aadhaar నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
* మీ ఆధార్ నెంబర్ లింక్ చేసేందుకు స్ర్కీన్లపై నేవిగేట్ చేయండి

ఇంటర్నెట్ బ్యాంకింగ్ : 
* మీ అకౌంట్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ తో మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది.
* ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజీ ఓపెన్ చేయండి.
* మీ E-servicesపై క్లిక్ చేసి ఇంటర్నెట్ పర్సనల్ బ్యాంకింగ్ అకౌంట్ ఎంచుకోండి.
* Login బటన్ పై క్లిక్ చేసి Login to Continue పై మరోసారి క్లిక్ చేయండి.
* మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
* Update ఆధార్ విత్ బ్యాంకు అకౌంట్స్ (CIF) ఆప్షన్ ఎంచుకోండి.
* ఇక్కడ మీ ప్రొఫైల్ పాస్ వర్డ్ ఎంటర్ చేసి Submit బటన్ క్లిక్ చేయండి.
* Drop Down మెనూలో CIF నెంబర్ ఎంపిక చేసుకోండి. 
* మీ ఆధార్ నెంబర్ రెండు సార్లు ఎంటర్ చేసి Submit బటన్ క్లిక్ చేయండి.
* SBI బ్యాంకు అకౌంట్ తో మీ ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది. 
* అనుసంధానం విజయవంతంగా పూర్తి అయినట్టుగా కన్ఫర్మేషన్ వస్తుంది. 

ATM ద్వారా అకౌంట్‌తో ఆధార్ లింక్ : 
* ఏదైనా SBI ATM దగ్గరకు వెళ్లండి.
* మీ ఎస్బీఐ డెబిట్ కార్డును స్వైప్ చేసి పిన్ ఎంటర్ చేయండి.
* సర్వీసు Registration అనే ఆప్షన్ ఎంపిక చేసుకోండి.
* ఆధార్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోండి.
* Savings/Current లేదా Checking అకౌంట్ ఎంచుకోండి.
* ఇక్కడే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
* కన్ఫర్మేషన్ కోసం మరోసారి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
* మీ రిక్వెస్ట్ ను బ్యాంకు అంగీకరిస్తుంది. 
* మీ ఆధార్ నెంబర్ బ్యాంకు అకౌంట్‌తో అనుసంధానం అయినట్టే.

Mobile App ద్వారా అకౌంటుతో ఆధార్ లింక్ :
* మీ స్మార్ట్ ఫోన్ లో SBI anywhere personal mobile app ఇన్ స్టాల్ చేసుకోండి.
* ఎస్బీఐ మొబైల్ యాప్ ఓపెన్ చేయండి.
* Requests అనే ఆప్షన్ ఎంచుకోండి.
* ఆధార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
* ఆధార్ లింకింగ్ ఆప్షన్ ఎంపిక చేయండి.
* డ్రాప్-డౌన్ మెనూలో మీ CIF నెంబర్ సెలెక్ట్ చేయండి.
* మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ధ్రువీకరించండి.
* Disclaimer ఆప్షన్ దగ్గర టిక్ చేయండి, (టర్మ్స్ అండ్ కండీషన్స్ రీడింగ్)
* Submit బటన్ పై క్లిక్ చేయండి.
* మీ రిక్వెస్ట్ ప్రాసెస్ అవుతున్నట్టుగా ఒక మెసేజ్ వస్తుంది. 
* ఎస్బీఐ బ్యాంకు రికార్డుల్లో మీ ఆధార్ నెంబర్ మీ అకౌంటుతో లింక్ అవుతుంది.
* చివరిగా OK బటన్ పై క్లిక్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేస్తే చాలు.. 

CIF నెంబర్ తెలియదా? అయితే ఇలా చేయండి. 
* మీ బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ ఫస్ట్ పేజీపై CIF నెంబర్ ఉంటుంది. 
* ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో అకౌంట్ స్టేట్ మెంట్ లో కూడా కనిపిస్తుంది. 
* ఎస్బీఐ 1800 11 2211, 1800 425 3800, 080-26599990 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. 
* మీ అకౌంట్ ఉన్న హోమ్ బ్రాంచ్ కు వెళ్లి కూడా CIF నెంబర్ తెలుసుకోవచ్చు.