క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? : ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకోవడం వెరీ కామన్. క్రెడిట్ కార్డు ఉన్న ప్రతిఒక్కరూ ఈజీగా లోన్ తీసుకుంటున్నారు. అన్ సెక్యూర్డ్ లోన్ అయినప్పటికీ.. పర్సనల్ లోన్.. క్రెడిట్ కార్డు లోన్ దాదాపు ఒకటే.

  • Published By: sreehari ,Published On : February 22, 2019 / 02:42 PM IST
క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? : ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకోవడం వెరీ కామన్. క్రెడిట్ కార్డు ఉన్న ప్రతిఒక్కరూ ఈజీగా లోన్ తీసుకుంటున్నారు. అన్ సెక్యూర్డ్ లోన్ అయినప్పటికీ.. పర్సనల్ లోన్.. క్రెడిట్ కార్డు లోన్ దాదాపు ఒకటే.

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకోవడం వెరీ కామన్. క్రెడిట్ కార్డు ఉన్న ప్రతిఒక్కరూ ఈజీగా లోన్ తీసుకుంటున్నారు. అన్ సెక్యూర్డ్ లోన్ అయినప్పటికీ.. పర్సనల్ లోన్.. క్రెడిట్ కార్డు లోన్ దాదాపు ఒకటే. సాధారణంగా ఏ బ్యాంకు నుంచి అయిన పర్సనల్ లోన్ అప్రూవ్ కావాలంటే ఎన్నో డాక్యుమెంట్లు ఇవ్వాలి.. మీరు ఉద్యోగి అయితే (మూడు నెలల జీతానికి సంబంధించి పే స్లిప్స్, బ్యాంకు స్టేట్ మెంట్..ఇలా ఎన్నో బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. అన్నీ డాక్యుమెంట్లు కరెక్ట్ గా ఉన్నప్పటికీ లోన్ అప్రూవ్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది.

అదే.. క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటే మాత్రం.. ప్రీ-అప్రూవ్ అయిపోతుంది. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. క్షణాల్లో మీకు కావాల్సిన లోన్ పైకమంతా మీ బ్యాంకు అకౌంట్లోకి వచ్చి చేరుతుంది. క్రెడిట్ కార్డుదారులు ఎవరైనా సరే.. సులభంగా ఇన్ స్టంట్ లోన్ తీసుకోవచ్చు.. జంబో లోన్.. ఇలా ఎన్నో లోన్ ఆఫర్లు ఉంటాయి. మీకు కావాల్సిన లోన్ ఎంచుకొని Apply చేసుకోవచ్చు. ప్రస్తుతం HDFC, ICICI, HSBC, Citibank, Axis Bank వంటి ఎన్నో ప్రైవేటు బ్యాంకులు తమ బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డు పొందినవారికి ఆయా కార్డులపై Instant, Jombo loans ఆఫర్ చేస్తున్నాయి. క్రెడిట్ కార్డులపై ఇచ్చే లోన్లపై ఒక్కోదానికి ఒక్కో రకంగా (ఇంట్రస్ట్) వడ్డీ ఉంటుంది.
Read Also: యూజర్లకు అలర్ట్ : మీ వాట్సాప్‌కు వల్గర్ మెసేజ్‌లు వస్తున్నాయా?

మామూలుగా బ్యాంకులు క్రెడిట్ కార్డులపై ఇచ్చే లోన్లపై 13 శాతం నుంచి 21 శాతం వరకు వడ్డీలను విధిస్తాయి.  మీ క్రెడిట్ కార్డుపై క్రెడిట్ లిమిట్ ఉంది కదా అని క్యాష్ విత్ డ్రా చేయకూడదు. క్యాష్ రూపంలో క్రెడిట్ కార్డు నుంచి విత్ డ్రా చేస్తే మాత్రం బ్యాంకులు భారీగా వడ్డీలు వడ్డిస్తాయి. అదే.. మీరు క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటే మాత్రం.. తక్కువ వడ్డీని విధిస్తాయి.

బాగానే ఉంది కదా? అని తొందరపడి క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకోవద్దు. క్షణం ఆలోచించండి. అసలు లోన్ అవసరమా? ఎందుకు లోన్ తీసుకుంటున్నాం. ఏంటి ఆ అత్యవసరం అని ఆలోచించండి.. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించుకోండి. ఏదో బ్యాంకు ఆఫర్ చేసింది కదా? అని క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకోవద్దని అంటున్నారు విశ్లేషకులు. అందులోనూ మీ క్రెడిట్ కార్డుపై ఇచ్చిన క్రెడిట్ లిమిట్ కు మించి మాత్రం తీసుకోవద్దని గట్టిగా సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డు లోన్ తీసుకునే ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసువాలంటున్నారు. 

1. లోన్ కాల పరిమితి :  క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకునే ముందు క్రెడిట్ కార్డుదారులు తప్పక గుర్తించుకోవాల్సిన మొదటిది.. లోన్ కాల పరిమితి. మీరు తీసుకునే లోన్ ఎన్ని నెలలు ఉండాలో ఎంచుకోవడం.. దాదాపు అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులపై ఫ్లెక్సిబల్ టెన్యూర్ ఆప్షన్ ఆధారంగానే తమ కస్టమర్లకు లోన్లు ఇస్తుంటాయి. మీ అవసరాన్ని బట్టి.. 3 నెలలు, 6 నెలలు, 12 నెలలు, 24నెలలు, 36నెలలు ఇలా EMI పేమింట్ ఎంచుకుంటారు. సాధారణంగా బ్యాంకులు కనీసం 24 నెలలు కాల పరిమితి ఉండేలా సూచిస్తుంటాయి. ఇది.. ఒక్కో కస్టమర్ కు ఒక్కోలా EMI పేమెంట్ ఉంటుంది. 

2. లేట్ పేమెంట్స్ వద్దు : కొంతమంది క్రెడిట్ కార్డుదారులు గడువు తేదీ దాటాక క్రెడిట్ కార్డులపై లోన్ పేమెంట్ చేస్తుంటారు. లేట్ పేమెంట్స్ ను దూరం పెట్టండి. ఈ ఎఫెక్ట్ మీ టాప్-అప్ లోన్ పై పడుతుంది. పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. ఇన్ టైంలో పేమెంట్స్ చేసినవారికి బ్యాంకులు టాప్-అప్ లోన్స్ ఆఫర్ చేస్తుంటాయి. ఈ ఆఫర్ వర్తించాలంటే.. మీకు మంచి క్రెడిట్ స్కోరు (హిస్టరీ) ఉండాలి. లేటు పేమెంట్స్ ఉండకూడదు. తద్వారా మీపై బ్యాంకు దృష్టిలో మంచి గుర్తింపు ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని లోన్ ఆఫర్లు పొందాలంటే.. లేటు పేమెంట్స్ అవైడ్ చేయడమే ఉత్తమం. 

3. ప్రాసెసింగ్ ఛార్జీలు: క్రెడిట్ కార్డుపై ఏ లోన్ తీసుకున్నప్పటికీ చాలా బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీ ఛార్జీలు విధిస్తాయి. ఈ ప్రాసెసింగ్ ఫీ.. ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా ఉంటాయి. Loan Amout బట్టి.. Processing ఫీజు.. 1 శాతం నుంచి 5 శాతం వరకు ఉంటుంది. దీనికి అదనంగా జీఎస్టీ కూడా విధిస్తుంటాయి.

4. ఫ్రీ క్లోజింగ్ లోన్ : ఫ్రీ క్లోజింగ్ లోన్ అంటే.. లోన్ తీసుకున్న కాల పరిమితి ముగియక ముందే లోన్ క్లోజింగ్ చేసుకోవడం.. ఉదాహరణకు.. 24నెలల కాలపరిమితిపై లోన్ తీసుకున్నారనుకుందాం. 6 నెలల వరకు లోన్ EMI ద్వారా పేమెంట్ చేస్తు వచ్చారు. ఆ తరువాత లోన్ మొత్తాన్ని ఒక్కసారే చెల్లించాలనుకున్నారు. అంటే.. ఇంకా 18 నెలల (EMI) మిగిలే ఉన్నాయి. ఈ 18నెలల మొత్తాన్ని ఒకేసారి పే చేయాలంటే మాత్రం.. మిగిలిన సొమ్ము మొత్తంపై (మిగిలిన EMIలతో కలిపి) ఛార్జీలు వర్తిస్తాయి.    

5. క్రెడిట్ కార్డు డిఫాల్ట్.. లోన్ డిఫాల్ట్ కాదు:  క్రెడిట్ కార్డు డిఫాల్ట్.. లోన్ డిఫాల్ట్ ఒకటి కాదు. రెండు వేర్వేరు. క్రెడిట్ కార్డుపై రీపేమెంట్ డిఫాల్ట్.. క్రెడిట్ కార్డుపై లోన్ డిఫాల్ట్ వేర్వేరు అనే విషయం గుర్తించాలి. రెండెంటిపై ప్రభావం వేరేలా ఉంటుంది. క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటే.. లోన్ డిఫాల్ట్ గా పరిగణినలోకి తీసుకుంటారు. ఇది మీ క్రెడిట్ స్కోరుపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. క్రెడిట్ కార్డు డిఫాల్ట్ కూడా క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతుంది. కానీ, లోన్ డిఫాల్ట్ పై చూపించేంత ప్రభావం మాత్రం ఉండదు.  
Read Also: శాంసంగ్ గెలాక్సీ S10 సిరీస్ వచ్చేసింది : ఇండియాలో ఎంతంటే?