2020 ఎండింగ్‌.. ఆసియాలో కొత్త కుబేరుడు.. అంబానీని వెనక్కి నెట్టేశాడు!

2020 ఎండింగ్‌.. ఆసియాలో కొత్త కుబేరుడు.. అంబానీని వెనక్కి నెట్టేశాడు!

Zhong Shanshan dethrones Ambani Asia’s richest : 2020 ఏడాదికి ఎండ్ కార్డు పడే సమయంలో ఆసియాలో కొత్త కుబేరుడు అవతరించాడు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టేశాడు. ఆయనే.. చైనాకు చెందిన 66ఏళ్ల జాంగ్ షంషాన్.. తన కెరీర్‌‌ను జర్నలిజం, పుట్టగొడుగుల సేద్యం, హెల్త్ కేర్ వంటి రంగాల్లో రాణించి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు.

2020 ఏడాదిలో 70.9 బిలియన్ డాలర్ల నికర విలువ పెరగడంతో ఈయన వ్యక్తిగత ఆదాయం మొత్తం 77.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. దాంతో ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ ర్యాంకులో నిలిచినట్టు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ప్రస్తుతం ముకేశ్‌ అంబానీ వ్యక్తిగత సంపద 76.9 బిలియన్‌ డాలర్లతో జాంగ్ తర్వాతి స్థానంలో నిలిచారు. తద్వారా ముకేశ్‌ అంబానీ ప్రపంచ కుబేరుల్లో నాలుగో ర్యాంకులో చేరారు.

ఇతర ఆసియా కుబేరుల్లో పిన్‌డ్యువోడ్యువో అధినేత కొలిన్‌ హువాంగ్ 63.1 బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత సంపదతో మూడో ర్యాంకులో నిలిచారు. టెక్‌ దిగ్గజం టెన్సెంట్‌ చీఫ్‌ పోనీ మా 56 బిలియన్‌ డాలర్లతో తదుపరి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈకామర్స్ దిగ్గజం అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్‌ మా 51.2 బలియన్‌ డాలర్లతో ఐదో ర్యాంకును పొందారు.