Zomato; జొమాటో షేర్లు ఢమాల్, 52వారాల తర్వాత..

జొమాటో ఎంట్రీతో అదరగొట్టినా.. సంక్రాంతి తర్వాత షేర్ హోల్డర్లకు చుక్కలు చూపెట్టింది. గతేడాది షేర్ మార్కెట్లోకి వచ్చి భారీ రేంజ్ లో కస్టమర్లను సంపాదించుకుంది. బీఎస్ఈలో 9 శాతం పడిపోయి

Zomato; జొమాటో షేర్లు ఢమాల్, 52వారాల తర్వాత..

Zomato

Zomato; జొమాటో ఎంట్రీతో అదరగొట్టినా.. సంక్రాంతి తర్వాత షేర్ హోల్డర్లకు చుక్కలు చూపెట్టింది. గతేడాది షేర్ మార్కెట్లోకి వచ్చి భారీ రేంజ్ లో కస్టమర్లను సంపాదించుకుంది. బీఎస్ఈలో 9 శాతం పడిపోయిన జొమాటో.. రూ.114.00కు పడింది. కంపెనీ స్టాక్ ధర 52 వారాల గరిష్టం నుంచి 30 శాతానికి పైగా దిగజారడంతో ఆశలపై నీరుజల్లినట్లు అయింది.

గతేడాది లైఫ్ టైం మ్యాగ్జిమం రూ.160.30కి చేరిన షేర్ ధర, జనవరి 23 అత్యంత కనిష్ట స్థాయి రూ.114కి పడిపోయింది. కేవలం ఈ ఏడాదిలోనే ఈ కంపెనీ షేర్ ధర 20 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. రిటైల్ మార్కెట్ లో స్విగ్గీతో పోటీ.. ట్రేడింగ్ పైనా ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు.

అనేక విధాలుగా స్విగ్గీ నుంచి పోటీని ఎదుర్కొంటున్న జొమాటో కంపెనీ.. ప్రధానంగా మెట్రో సిటీల్లోని రెస్టారెంట్ నెట్‌వర్క్, స్విగ్గీ నుంచి ఈ పోటీ ఉందని వైస్ ప్రెసిడెంట్ & రీసెర్చ్ ఆఫ్ షేర్ ఇండియా డాక్టర్ రవి సింగ్ తెలిపారు.

ఇది కూడా చదవండి : ‘కె.జి.యఫ్ 2’ క్రేజ్ పీక్స్..

నాలుగు ట్రేడింగ్ సెషన్లోనే సుమారు రూ.10 వేల కోట్లకు నష్టపోయినట్లుగా తెలుస్తుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్ కూడా రూ.1 లక్ష కోట్ల దిగువకు పడింది. ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోకు సెప్టెంబర్‌ క్వార్టర్‌లో నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. రూ.435 కోట్ల కన్సాలిడేటెడ్‌ నష్టాన్ని ప్రకటించింది.