లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

కాబోయే భర్తతో కలిసి ప్రియుడ్ని హత్య చేసిన ప్రియురాలు

Published

on

Businessman killed by girlfriend’s fiance, family for Objecting to Wedding :  ఢిల్లీకి చెందిన నీరజ్ గుప్తా(46) అనే వ్యాపారవేత్త నవంబర్ 13నుంచి  కనపడటం లేదని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. గుప్తా భార్య పలువురు అనుమానితుల పేర్లు వెల్లడించింది. వారిలో గుప్తా దగ్గర పనిచేస్తున ఫైజల్ (28) అనే మహిళ కూడా ఉంది.

ఫైజల్ గుప్తా వద్ద 10ఏళ్ళుగా పనిచేస్తోంది. గుప్తా సెల్ ఫోన్ కాల్ రికార్డ్ లు పరిశీలించిన పోలీసులకు పైజల్ పై అనుమానం మరింత బలపడింది. పోలీసులు ఆమెను  అదుపులోకి తీసుకుని ప్రశ్నించేసరికి హత్య చేసినట్లు ఒప్పుకుంది.వాయువ్య ఢిల్లీలోని మోడల్ టౌన్ లో నివసించే నీరజ్ గుప్తా కరోలా బాగ్ లో ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గుప్తా వద్ద ఫైజల్ అనే మహిళ 10 ఏళ్లుగా పని చేస్తోంది.  ఈక్రమంలో గుప్తా, ఫైజల్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

కాగా ఇటీవల ఫైజల్ కు, రైల్లో ప్యాంట్రీ కార్ లో పని చేసే జుబైర్ అనే వ్యక్తితో పెళ్లి చేయ నిశ్చయమయ్యింది. వివాహానికి ముహర్తాలు కూడా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని  ఆమె గుప్తాకు చెప్పగా, అతను ఆమె వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి  వీల్లేదని అభ్యంతరం తెలిపాడు.ఈవిషయంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.నవంబర్ 13వ తేదీ న నీరజ్ గుప్తా…ఫైజల్ నివసించే ఆదర్శనగర్ లోని కేవాల్ పార్క్ ఎక్స్ టెన్షన్ లో అద్దె ఇంటికి వచ్చాడు. అక్కడు ఫైజల్, ఆమెకు కాబోయే భర్త జుబైర్, తల్లి  షాహిన్ నాజ్ తో గొడవ పడ్డాడు. ఆ సమయంలో ఫైజల్ కాబోయే భర్త జుబైర్, గుప్తా తలపై ఇటుకతో కొట్టి, కడుపులో పొడిచాడు. అనంతరం కత్తితో గొంతు కోసి హత్య చేసాడు.  ముగ్గురు కలిసి గుప్తా మృతదేహాన్ని సూట్ కేసులో సర్దారు.అక్కడి నుంచి జూబైర్ సూట్ కేసు లో మృతదేహాన్ని గుజరాత్ తీసుకు వెళ్లేందుకు నిజాముద్దీని రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. జుబైర్ రైల్వే ప్యాంట్రీ కార్ లో పనిచేస్తుండటంతో అతడు తీసుకువెళుతున్న సూట్ కేసును ఎవరూ అనుమానించలేదు. జుబైర్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో గుజరాత్ బయలు దేరాడు.

డేటింగ్ యాప్ తో యువకుడ్ని కలవటానికి వెళ్లి చావు తప్పి బైటపడ్డ యువతి


రైలు గుజరాత్ లోని భరూచ్ సమీపంలోకి రాగానే సూట్ కేసును రైలులోంచి బయటకు విసిరేసాడు. అనతరం ఏమీ ఎరుగనట్లు తిరిగి ఢిల్లీ చేరుకున్నాడు. కేసు విచారించిన  పోలీసులు జుబైర్, షాహిన్ నాజ్, ఫైజల్ ను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.మృతదేహాం కోసం గాలింపు చేపట్టారు. ఐపీసీ సెక్షన్ 356  కింద నిందితులపై కేసు నమోదు చేసిన దర్యాప్తు కొనసాగిస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్ వెస్ట్) విజయంత ఆర్య చెప్పారు.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *