లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

బటర్ ఛాయ్, ఘాటుగా స్పందించిన నెటిజన్లు

Published

on

Butter Chai In Agra : పొద్దు పొద్దునే టీ, కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. ఛాయ్ తాగితే ఏ పని చేయలేం..అంటుంటారు కొందరు. గరం గరం ఛాయ్ నోట్లో పడితే..గాని..ఒంట్లో శక్తి రాదంటారు మరికొందరు. అనేక రకాలుగా ఛాయ్ తయారు చేస్తుంటారు. అల్లం టీ, మసాలా టీ, లెమన్ టీ..ఇలా కొన్ని రకాలుంటాయి. కానీ..బటర్ ఛాయ్ తాగారా ఎప్పుడైనా..అంటే ఛీ..వెన్నతో ఛాయా అంటూ..చీదరించుకొంటున్నారా..కానీ ఓ వ్యక్తి ఇలాంటి టీ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నెటిజన్లు కాస్త ఘాటుగానే స్పందించారు.

ఆగ్రాలోని బాబా స్టాల్ లో ఓ వ్యక్తి ఇలాంటి టీ తయారు చేశాడు. మరుగుతున్న ఛాయ్ లో బటర్ కట్ చేస్తూ..వేశాడు. మిగిలిన బటర్ ను కూడా అంతా వేశాడు. వడపోసి బయటపెట్టాడు. foodieagraaaaa అనే అకౌంట్ నుంచి ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. కాసేపట్లోనే ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. అసలు టీలో బటర్ వేయడం ఏంటీ రా బాబు..అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వీడియో పోస్టు చేసిన కాసేపటికే…2.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇష్టమైన టీలో బటర్ వేయడమే కాకుండా..కాస్త సాస్ కూడా వేయకపోయావా ? అంటూ ఘాటుగా రియాక్షన్ ఇచ్చారు. కొంచెం పావ్ బాజీ కూడా వెయ్ అంటూ తమ కోపాన్ని కామెంట్ల రూపంలో వెలిబుచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by FOODIEAGRA (@foodieagraaaaa)