అందాల పోటీలో ఏపీ సీతాకోక చిలుకలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జాతీయస్థాయిలో ఉత్తమ సీతాకోక చిలుకలు ఫైనల్ పోటీలు జరుగుతున్నాయి. ఆన్ లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహస్తున్నారు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమైన ఓటింగ్ అక్టోబర్ 08వ తేదీ వరకు జరుగనుంది. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చని వైల్డ్ లైఫ్ డివిజనల్ ఫారెస్టు అధికారి సి.సెల్వమ్ వెల్లడించారు.ఇదిలా ఉంటే..మొత్తం 7 రకాలు ఎంపికయ్యాయి. 2021 సంవత్సరానికి కొనసాగుతోన్న ఈ పోటీలో పశ్చిమగోదావరి జిల్లా పాపికొండల అభయారణ్యంలోని కామన్‌ జేజేబెల్, కామన్‌ నవాబ్, ఆరెంజ్‌ ఓకలీఫ్‌ అనే మూడు జాతులు ఎంపికయ్యాయి.
ఈ అభయారణ్యంలో 130 రకాల సీతకోక చిలుకలున్నాయి.తుదిజాబితాకు ఎంపికైనవ అరుదైనవని వైల్డ్ లైఫ్ శాస్త్రవేత్త కె.బాలాజీ వెల్లడించారు. దాదాపు 9 నెలల పాటు కష్టపడి ఫొటోలు సేకరించామని, జాతీయస్థాయిలో ఎంపికైతే..ఈ ప్రాంతానికి మరింత పేరు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత..జాతీయస్థాయిలో ఉత్తమ సీతాకోక చిలుకను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.

Related Posts