లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనపై చిదంబరం ఆందోళన

Published

on

“Bypoll Results Show…”: Now P Chidambaram’s Truth Bombs for Congress ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరియు 11రాష్ట్రాల ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ వైఫ‌ల్యం చెందిన తీరు ప‌ట్ల ఆ పార్టీ సీనియ‌ర్ నేత పీ చిదంబ‌రం ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆన‌వాళ్లు లేనట్లుగా క‌నిపిస్తోంద‌ని,కాంగ్రెస్ బలహీనపడినట్లు అర్థమవుతోందని చిదంబరం అన్నారు. ఓవైపు కాంగ్రెస్ కాంగ్రెస్ పేలవ ప్ర‌ద‌ర్శ‌న‌పై కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సమయంలో ఇప్పుడు చిదంబరం వ్యాఖ్యలు ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉంది.ఓ ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ… బీహార్ లో ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆర్జేడీ-కాంగ్రెస్ కూట‌మిగా బీహార్‌లో గెలిచే ఛాన్సు ఉంది, కానీ విజ‌యానికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి ఓడిపోయామ‌ని, దీనిపై స‌మ‌గ్ర ప‌రిశీలిన చేయాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. వ్య‌వ‌స్థీకృతంగా బ‌లంగా ఉంటే చిన్న పార్టీలు కూడా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంటాయ‌ని సీపీఐ-ఎంఎల్‌, ఎంఐఎంలు నిరూపించిన‌ట్లు చిదంబ‌రం పేర్కొన్నారు.


అమెరికాకు ఇండియన్ స్టూడెంట్స్ ఏడాదికి ఎంత ఇచ్చారంటే?


క్షేత్ర స్థాయిలో పార్టీని వ్య‌వ‌స్థీకృతంగా బ‌లంగా మారిస్తేనే బీజేపీ కూట‌మిని కొట్ట‌గ‌ల‌మ‌ని చిదంబ‌రం తెలిపారు. రాజస్తాన్,మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్,జార్ఖండ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించి చాలాకాలం కాలేదని గుర్తుంచుకోవాలన్నారు. గుజరాత్,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,కర్ణాటక రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఫలితాలను చూసి తాను చాలా ఆందోళన చెందానని చిదంబరం పేర్కొన్నారు. త్వరలో జరుగబోయే తమిళనాడు,వెస్ట్ బెంగాల్,అసోం,కేరళ రాష్ట్రాల్లో ఫలితాలు ఏ విధంగా వస్తాయో చూడాలని చిదంబరం అన్నారు.కాగా,రెండు రోజుల క్రితం బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాభవం చవి చూసిన కాంగ్రెస్‌ పార్టీని దేశ ప్రజలు ఇక ఏమాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను ప్రస్తావించిన కపిల్ సిబల్..పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సమస్యలేంటో అందరికీ తెలుసు. వ్యవస్థాపకంగా ఎలాంటి లోపాలున్నాయో తెలుసు. వాటి పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలకు సమాధానాలేంటో పార్టీకి తెలుసు. అయినా వాటిని అధికారికంగా గుర్తించడానికి మాత్రం వారు ఇష్టపడడం లేదు. ఇలాగే కొనసాగితే పార్టీ గ్రాఫ్‌ పడిపోతూనే ఉంటుంది. అలాంటి దుస్థితిలో పార్టీ ఉందన్నదే మా ఆవేదన అని కపిల్ సిబల్ అన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *