అతి త్వరలోనే CAA అమల్లోకి…బీజేపీ చీఫ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

CAA will be implemented very soon అతి త్వరలోనే పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని అమల్లోకి వస్తుందని సోమవారం(అక్టోబర్-19,2020) బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ సంస్థాగత విషయాలపై స్థానిక నాయకులతో మాట్లాడేందుకు వెస్ట్ బెంగాల్ లోని సిలిగురిలో పర్యటిస్తున్నారు జేపీ నడ్డా.ఈ సందర్భంగా సిలిగురిలో ఓ ర్యాలీలో నడ్డా మాట్లాడుతూ…CAA అమలుకు పార్టీ కట్టుబడి ఉంది. అందరూ దాని లబ్దిని పొందుతారు. కరోనా కారణంగా సీఏఏ అమలులో ఆలస్యం జరిగింది. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నందున పని ప్రారంభమైంది..రూల్స్ ని ఫ్రేమ్ చేస్తున్నారు. అతి త్వరలో సీఏఏ అమల్లోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా టీఎంసీ అధినేత్రి,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు జేపీ నడ్డా. విభజించి..పాలించు పద్దతి పద్దతిలో మమత ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. టీఎంసీలా కాకుండా అందరికీ అభివృద్ధి కావాలని బీజేపీ వర్కర్స్ కోరుకుంటున్నారన్నారు.కాగా, డిసెంబర్-31,2014కి ముందు పాకిస్తాన్,బంగ్లాదేశ్,ఆఫ్గనిస్తాన్ నుంచి భారత్ కు శరణార్థులుగా వచ్చిన ముస్లింలకు తప్ప హిందువులకు,సిక్కులకు,బౌద్ధులకు,జైనులకు,పార్శీలకు,క్రిస్టియన్లకు భారతీయ సిటిజన్ షిప్ ఇచ్చేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని డిసెంబర్-11,2019న పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే.అయితే, కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు సీఏఏని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పలు చోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్,ఢిల్లీలో అయితే ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఆందోళనల కారణంగా ప్రాణనష్టం,ఆస్తినష్టం కూడా భారీగానే జరిగింది. పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు రాళ్లు రువ్వడం వంటి దాడులకు పాల్పడటంతో పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

Related Tags :

Related Posts :