Home » సమ్మె విరమించిన క్యాబ్ డ్రైవర్స్
Published
1 year agoon
By
veegamteamతెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ నాయకులు సమ్మెను విరమించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కలిసిన క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ నాయకులు… సమ్మెకు దారితీసిన పరిణామాలను వివరించారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె మూలంగా జనం ఇబ్బందులకు గురవుతున్నారని…. చర్చలు జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతానని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు. గవర్నర్ హామీతో సమ్మె ప్రతిపాదనను విరమిస్తున్నట్లు డ్రైవర్స్ అసోసియేషన్ నేతలు ప్రకటించారు. మంగళవారంలోపు తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
శనివారం టీఎస్ఆర్టీసీ చేపట్టిన తెలంగాణ బందుకు ఆటోలు, క్యాబ్‌లు సంయుక్తంగా మద్ధతు తెలియజేయడంతో తెలంగాణ రోడ్ల పైకి 50వేల క్యాబ్‌లు విశ్రాంతిలో ఉండిపోయాయి. అక్టోబరు 5 నాటి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వగా ఆటోలు, క్యాబ్‌లు ఛార్జిలు పెంచి ప్రయాణికుల నుంచి దండుకున్నాయి. కాగా, సమ్మె 15వ రోజుకు చేరిన సమయంలో ఓలా, యూబర్ క్యాబ్‌లు సైతం ట్రాన్స్ పోర్ట్ యూనియన్ 12 గంటల బంద్ కు పిలపునిచ్చాయి. శనివారం ఉదయం 5గంటల నుంచి బంద్ తో తెలంగాణ రోడ్లపైకి దాదాపు 50వేలకు పైగా క్యాబ్ లు రాలేదు.
హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి అన్ని ఓలా, యూబర్ వంటి సర్వీసులు అన్నీ స్తంభించిపోయాయి. ఈ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ బంద్ పిలుపునివ్వడంతో ఎయిర్ పోర్టుకు, రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సిన వారు ప్రైవేటు వెహికల్స్ ను ఆశ్రయించారు. ప్రతిపక్షాలన్నీ ముకుమ్మడిగా సమ్మెకు మద్దతు తెలియజేశాయి.